You are here
Home > Latest News > అడ్డుకోండిరా దుర్మార్గుల్లారా అడ్డుకోండి.. మీ పాపం పండడం ఖాయం!

అడ్డుకోండిరా దుర్మార్గుల్లారా అడ్డుకోండి.. మీ పాపం పండడం ఖాయం!

Spread the love

 

 

  • – బీజేపీ నేతల తీరుపై ముస్లిం మైనారిటీల్లో తీవ్ర ఆగ్రహావేశాలు
  • – రిజర్వేషన్లు అడ్డుకుంటామన్న అమిత్ షా వ్యాఖ్యలపై అభ్యంతరం
  • – బీజేపీ రంగు మరోసారి బయటపడిందంటూ ఆందోళన

ఇదీ… బీజేపీ నేతల అసలు రంగు. ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా మతపరమైన రాజకీయాలు చేస్తారు కాబట్టే బీజేపీకి మతతత్వ పార్టీ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆ పేరును సార్థం చేసుకునేలా అమిత్ షా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుబడుతుండడాన్ని అమిత్ షా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్లుగా తీవ్రంగా వెనకబడి ఉన్న ముస్లింలను ఆదుకునే దిశలో అద్భుతమైన చర్య పడుతుండగా అడ్డుకునేందుకు అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కేంద్రం ఎలాగూ ఆదుకోదు. రాష్ట్రమైనా ఆదుకుంటోంది అని ముస్లిం మైనారిటీలు పడుతున్న సంతోషాన్ని అమిత్ షా ఆవిరి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా… కేసీఆర్ ఎంత చేయాలో అంత చేస్తున్నారు. రంజాన్ లాంటి పండగను అధికారంగా నిర్వహిస్తూ తెలుగు సంప్రదాయం ప్రకారం ముస్లింలను గౌరవిస్తున్నారు. వారి పిల్లల కోసం ప్రత్యేకంగా మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి విద్య అందించారు.

విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇదంతా చూసి ముస్లిం సమాజం ఏనాడో కేసీఆర్ కు అండగా నిలిచింది. ఆయన అయితేనే తమ రాత, గీత బాగుపరచగలరని విశ్వసిస్తోంది. అది నిలబెట్టుకుంటూ.. సంక్షేమాన్ని పాతబస్తీ ఇంటింటికీ తీసుకువెళ్లడమే కాదు.. ముస్లింల మొహాల్లో ఆనందం కనిపించేలా కేసీఆర్ పరిపాలించారు. ఇందులో భాగంగా కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియనూ ముందుకు తీసుకుపోతున్నారు.

కానీ.. మంచికి పోతుంటే చెడు ఎదురవుతున్నట్టు కేసీఆర్ కు బీజేపీ అడ్డుపడుతోంది. రిజర్వేషన్లను అడ్డుకుంటుంటామంటూ శపథాలు చేస్తోంది. ఇదే.. మైనారిటీల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఎట్టిపరిస్థితుల్లో బీజేపీని ఓడించి తీరుతామన్న మాట… దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం నొక్కి వక్కాణిస్తోంది.

Top