You are here
Home > Latest News > అణచివేత చరిత్ర.. కాంగ్రెస్ కే సొంతం

అణచివేత చరిత్ర.. కాంగ్రెస్ కే సొంతం

Spread the love
  • అణచివేత అనేది కాంగ్రెస్ పార్టీకే సొంతం …
  • అణచివేసింది కాంగ్రెస్ పార్టీనే ..
  • మీరా అనచివత గురించి మాట్లాడేది …

అణచివేత… ఈ పదాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలకంటే ఇంకెవరికి అర్హత ఉంది? తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేశారు. మలి దశ ఉద్యమాన్ని అణగదొక్కారు. కాంగ్రెస్ దాష్టీకాలకు చరమగీతం పాడిన నాటి ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోడుగా.. యువత పోరాటం చేస్తుంటే.. అప్పుడు కూడా అణచిపారేసేందుకు కాంగ్రెస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. అదీ అణచివేత అంటే.

ఆఖరికి యువకుల ఆత్మ బలిదానాలతో దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ ఆమరణ దీక్షకు తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం.. విధిలేక తెలంగాణ ఇచ్చింది. అది కూడా లోప భూయిష్టంగా చేసి.. అప్పుడు కూడా తెలంగాణను అణగదొక్కి.. సీమాంధ్ర ప్రభుత్వానికి మేలు చేసింది. తనకే సొంతమైన అణచివేత సంస్కృతిని ప్రదర్శించుకుంది. ఆ చరిత్రను మరిచిపోతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్.. ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.

ప్రశ్నించాలనుకున్నవారిని ప్రభుత్వం అణచివేస్తోందని అంటున్నాడు. కానీ.. ఇప్పుడు కుట్రల కోదండరాం బ్యాచ్ తో పాటు.. ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలన్నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నా.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించని ప్రభుత్వం తీరును ఉత్తమ్ గమనించలేకపోతున్నాడు. కళ్లుండి కూడా రాజకీయంగా చూపులేని వాడిలా ప్రవర్తిస్తున్నాడు. తీరు మార్చుకోకుంటే.. మరోసారి పరాభవం తప్పదన్న వాస్తవాన్ని కూడా మరిచిపోతున్నాడు.

Top