You are here
Home > Latest News > అది పీపుల్స్ మ్యానిఫెస్టో కాదు.. పీక్కుతినే మ్యానిఫెస్టో..

అది పీపుల్స్ మ్యానిఫెస్టో కాదు.. పీక్కుతినే మ్యానిఫెస్టో..

Spread the love

 

  • 60 ఏళ్లలో ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు..
  • ఇప్పుడు గుర్తొచ్చిందా తెలంగాణ సంక్షేమం..
  • టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టడానికి సిగ్గులేదు..

రైతుల గురించి ఇప్పుడు యాదికొచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇన్నిరోజులు తెలంగాణలో రైతులు ఉన్నారన్న విషయాన్నే మరిచింది. తమ 60 ఏళ్ల పాలనలో రైతులు లేరా? అప్పుడు రైతులు గుర్తుకురాలేదా? రైతులు గోడుగోడున ఏడుస్తుంటే చోద్యం చూసింది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? అప్పుడెందుకు 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయారు. ఇప్పుడు చేస్తాం అంటూ ముందుకొచ్చిన వాళ్లు ఇదివరకు కూడా చేసి ఉండాలి కదా. చేయలేదంటే ఏంటి అర్థం. మీరు కేవలం అధికారం కోసం కుయుక్తులకు పాల్పడే కుక్కలని అర్థమయిపోతూనే ఉన్నది కదా.

సరే.. అవన్నీ ఎందుకు… ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలయితే ఉన్నాయి కదా రెండో మూడో. ఆ రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకాలను అమలు చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేసి చూపించాలి. అనంతరం తెలంగాణలో ఈ పథకాలను మ్యానిఫెస్టోలో పెట్టాలి. లేదా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ పథకాలనైతే కాంగ్రెస్ ప్రారంభించిందే.. అవే పథకాలను తెలంగాణ మ్యానిఫెస్టోలో కూడా పెట్టాలి కానీ.. ఇలా పనికిమాలిన హామీలు.. అమలుకు నోచుకోని హామీలు.. ఎలాగూ ఇచ్చేది లేదు చచ్చేది లేదు అన్న చందంగా ఏది నోటికొస్తే దాన్ని మ్యానిఫెస్టోలో చేర్చి ఏం సాధిద్దామనుకుంటున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని ప్రారంభిస్తే అవహేళన చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి.. ఇప్పుడు ఆ పథకాన్ని తమ మ్యానిఫెస్టోలో సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు ఎలా చేర్చారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. తమ జీవితంలో.. తమ పాలన మొత్తంలో ఏనాడైనా నిరుద్యోగులను పట్టించుకున్నారా? ఇప్పుడు మెగా డీఎస్సీ అంటూ తెగ ఆరాటపడుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు తమ పాలనలో ఎందుకు నిరుద్యోగులను గాలికి వదిలేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలను తమ 60 ఏళ్ల పాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు.. పరిస్థితి ఎలా ఉందనేది.

అందుకే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఎంత మభ్యపెట్టాలని చూసినా.. మోసం చేయాలని చూసినా.. అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. వేస్ట్.. వాళ్లకు ఏం ఫైదా ఉండదు. వాళ్ల గోతిని వాళ్లు తీసుకున్నట్టే. తెలంగాణ ప్రజలు అంతా నిశితంగా గమనిస్తున్నారు. వాళ్లకు ఏం చేయాలో తెలుసు. ఎవరికి ఓటేయాలో తెలుసు. మీరు ఎన్ని కుయుక్తులకు పాల్పడినా మీ పప్పులేమీ ఉడకవు ఇక.. కాంగ్రెస్ పార్టీని 60 ఏళ్లు నమ్మారు తెలంగాణ ప్రజలు.. ఏం ఒరగబెట్టారు. 60 ఏళ్ల కాలంలో మీ ఆస్తులను కూటబెట్టుకున్నారు తప్పితే తెలంగాణ ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు తెల్వదా? తెలంగాణ ప్రజలు అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా? మీరు ఎటువంటి హామీలు ప్రకటించినా.. తల ఊపుకుంటూ ఓటేస్తారనుకుంటున్నారా? ఖబడ్డార్.. మీ ఖేల్ ఖతం అయింది. ఈ విషయం 2014 లోనే రుజువయింది కదా. మళ్లీ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుద్ది. పోయి పల్లీలు అమ్ముకొని బతకాల్సిందే కాంగ్రెస్ నాయకులు ఇక.

Top