You are here
Home > Latest News > అన్యాయం జరిగిన మోడినీ ఏమి అనోద్దా ..???

అన్యాయం జరిగిన మోడినీ ఏమి అనోద్దా ..???

Spread the love

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్న ఆవేదనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన కామెంట్లను బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు కానీ.. గతంలో తాము అదే కేసీఆర్ గురించి ఎలాంటి మాటలు అన్నామన్న వాస్తవాన్ని మాత్రం వారు మరిచిపోతున్నారు. తమకో నీతి.. పరాయివాడికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తూ.. అన్యాయంగా ముఖ్యమంత్రిని తప్పుబడుతూ.. చరిత్రహీనులవుతున్నారు.

ముఖ్యమంత్రి అన్న మాటలపై.. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తికి గురయ్యారట. ఎందుకండీ అసంతృప్తి? ఇదే బీజేపీకి చెందిన ఓ లక్ష్మణ్.. ఓ కిషన్ రెడ్డి.. ఓ మురళీధర్ రావు.. ఓ కృష్ణ సాగర్ రావు.. ఇలా చెబుతూ పోతే చాలామంది ముఖ్యమంత్రిని అవమానించేలా మాట్లాడలేదా? రైతులకు మేలు చేస్తుంటే చేసి సహించలేక.. భూ స్వామి అని.. రజాకారు అనీ.. దొర అనీ.. రకరకాలుగా కామెంట్లు చేయలేదా?

అన్యాయం చేయకున్నా సరే.. బీజేపీ నేతలైతే వ్యక్తిగత దాడికి దిగొచ్చు.. కానీ.. అన్యాయం జరిగినా కూడా మోడీని ఏమీ అనవద్దు అంటున్న బీజేపీ నేతల సూత్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్రం ముష్టి విదిలిస్తే తీసుకోవాలి.. లేదంటే నోరు మూసుకుని పడుండాలా? బీజేపీ నేతలు ఇదే మాట చెబితే మాత్రం.. తెలంగాణ ప్రజలు ఊరుకోరు. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక మొత్తాన్ని కడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమే.

ఆదాయాన్ని సృష్టిస్తున్నరాష్ట్రంలో నంబర్ వన్ ఏదంటే అది మన తెలంగాణ రాష్ట్రమే. అలాంటి రాష్ట్రానికి కనీస కేటాయింపులు కూడా చేయకుండా ఇబ్బంది పెడుతున్న ప్రధాని మోడీని ఇంకేమని పొగడాలి.. ఇంకేమని కీర్తించాలి? ఇందుకు సమాధానం బీజేపీ నేతలే చెప్పాలి.

Top