You are here
Home > Latest News > అప్పుడు తెలంగాణ ఉద్యమంలో.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో..!

అప్పుడు తెలంగాణ ఉద్యమంలో.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో..!

Spread the love

 

  • తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచిపోనున్న నమస్తే తెలంగాణ, టీన్యూస్..
  • ఆంధ్రా మీడియాకు దీటుగా ఎదిగాయి..
  • తెలంగాణ ప్రజల గొంతుకలా మారాయి..

మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు తెలంగాణలో ఆంధ్రా పత్రికలు, న్యూస్ చానెళ్లు పాతుకుపోయాయి. అవిఆంధ్రా పాలకుల అడుగులకు మడుగులొత్తేవి. ఇక తెలంగాణ గొంతుకను వినిపించేదెలా? తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్నప్పుడు తెలంగాణ సమాజానికి ఉద్యమం తాలూకు సమస్యలను ఏ ఆంధ్రా పత్రికా, న్యూస్ చానెల్ కవర్ చేయలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ఏ పత్రికా పట్టించుకులేదు. ఏ న్యూస్ చానెల్ కవర్ చేయలేదు. దీంతో ప్రపంచానికి తెలంగాణ ఉద్యమం ఎలా జరుగుతుందో తెలిసేది కాదు.

అప్పుడే తెలంగాణ ఉద్యమ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని.. తెలంగాణ గొంతుకను యావత్తు ప్రపంచానికి వినిపించడానికి నీటి నుంచి పుట్టుకొచ్చిన తామర పుష్పంలా ఉద్భవించింది నమస్తే తెలంగాణ. ఆ తర్వాత టీ న్యూస్  చానెల్. అలా.. ఆంధ్రా పత్రికలను దీటుగా ఎదుర్కొంటూ మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని దశదిశలా చాటాయి నమస్తే, టీన్యూస్. అప్పుడు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసింది. తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికింది. అలా.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయాయి. ప్రజలు కూడా వాటిని ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. దీంతో నమస్తే తెలంగాణ సర్క్యూలేషన్, టీన్యూస్ టీఆర్పీ రేటింగ్స్ ఒకేసారి పెరిగాయి. తర్వాత తెలంగాణ వచ్చింది. అయినా.. వాటి పాత్ర పూర్తి కాలేదు.

ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. దీంతో ప్రజల ఆదరణ వాటికి ఇంకా పెరిగింది. టీఆర్పీ రేటింగ్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్న నమస్తే తెలంగాణ, టీన్యూస్ కు ప్రభుత్వం యాడ్స్ ఇస్తున్నది. ఇందులో పక్షపాత ధోరణి ఏమున్నది? ఎక్కువ సర్క్యులేషన్, టీఆర్పీ రేటింగ్స్ ఉన్నాయంటే.. వాటి రీచ్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం.ఎక్కువ రీచ్ ఉన్నవాటికే యాడ్స్ ఇవ్వడం సర్వసాధారణం. దాన్నే ప్రభుత్వం ఫాలో అవుతున్నది. ఇందులో తిరకాసు ఏం లేదు. మతలబు ఏం లేదు. కేవలం ప్రజల అభిమానం, ఆదరణ చురగొనడం తప్పితే.

Top