You are here
Home > Latest News > అబద్దాల వెబ్ సైట్ లు …తప్పుడు కథనాలు …!!

అబద్దాల వెబ్ సైట్ లు …తప్పుడు కథనాలు …!!

Spread the love
స‌భ్య స‌మాజానికి ప‌ట్టిన చీడ పురుగుల్లా తయారు అయ్యాయి కొన్ని వెబ్ సైట్లు.
ప‌దే ప‌దే ప్ర‌భుత్వం మీద విషం చిమ్ముతూ.. ప‌బ్బం గ‌డుపుకుంటున్నాయి.
ప‌చ్చి అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నాయి .
తెలంగాణ స‌మాజం చీ కొడుతున్నా.. చీద‌రించుకుంటున్నా?? బ‌రితెగించి వార్త‌లు రాస్తున్నాయి.
స‌ద్విమ‌ర్శ‌లు చేయండ్రా అంటే.. స‌త్యంలేని వార్త‌ల‌తో సమాజాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌జ‌లకు మంచి చేసే వార్త‌లు రాయాలి కానీ.. ప‌దే ప‌దే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వార్త‌లు రాయడం కరెక్ట్ కాదు . ఆకాశం మీద ఉమ్మెయ్యాల‌ని చూస్తే తిరిగి అది మీ మీదే ప‌డుతుంది.
కవితకి కేంద్ర మంత్రి పదవి అని అబద్దాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు ….
అనూహ్య మ‌లుపు అంటూ అడ్డ‌దిడ్డ‌మైన‌ పోస్టులు పెడుతున్న వెబ్ సైట్ల‌ నిర్వాహ‌కుల‌కు అస‌లు కొంచెమంతైనా జ్ఞానం ఉందా??. మోడీయో.. అమిత్ షాయో ఫోన్ చేసి చెప్పిన‌ట్లు.. ఢిల్లీ నుంచి విశ్వ‌స‌నీయ స‌మాచారం అని, సీఎం కేసీఆర్ కూతురు ప‌ద‌వి కోస‌మే ఢిల్లీలో మ‌కాం వేశారంటూ ఏదో సొల్లు రాశారు. చివ‌రికి ఏమైంది. మీవ‌న్నీ త‌ప్ప‌డు వార్త‌ల‌ని తేలిపోయింది. ముఖ్య‌మంత్రి గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ.. ఏకంగా సైట్ న‌డుపుతున్న మీ వెన‌కున్న శ‌క్తుల‌కు కూడా ఇదే మా హెచ్చ‌రిక. చెయ్యి ఉంద‌ని రాస్తాం.. నోరుంద‌ని వాగుతాం అంటే ఊరుకునేది లేదు. నిరాధార వార్త‌లు రాస్తే పోయేది మీ పరువే ….
తెలంగాణ స‌మాజం క‌ల్వకుంట్ల‌ చంద్ర‌శేఖ‌రుడిని.. చంద్రుడి లాగా చూస్తుంది ఈరోజు . మీ ఆలోచ‌న‌లు ఇంతే??. కానీ తెలంగాణ స‌మాజానికి, రాష్ట్రానికి, రాష్ట్రంలోని ప్ర‌తీ పేద‌వాడికి చేయాల్సిన ప‌నులు.. ముఖ్య‌మంత్రి గారికి చాలా ఉన్నాయి. అందుకే ఆరోగ్యంను సైతం ప‌క్క‌న పెట్టి కేసీఆర్ అనునిత్యం బిజీగా ఉంటున్నారు. కంటి ఆప‌రేష‌న్ వెళ్లి కూడా.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే కేంద్ర‌మంత్రుల‌ను క‌లుస్తున్నారు. దాన్ని ప‌ట్టుకుని.. మంత్రి ప‌ద‌వి కోస‌మ‌ని.. కేంద్రంలో చేరేందుకేన‌ని.. నోటికొచ్చిన‌ట్లు రాస్తున్నారు. ఇది క‌రెక్ట్ కాదు. ఇక‌నైనా మీ ప‌ద్ద‌తి మార్చుకోండి. తప్పుడు కూతలు కూయకండి??.
ఐరావ‌తం తొవ్వ‌ల పోతుంటే.. కుక్కలెన్నో మొరుగుతాయి. అవి మొరిగినంత మాత్రాన‌ ఐరావతం ఠీవీ ఏమాత్రం త‌గ్గ‌దు. అట్ల‌నే.. ఐరావ‌తం లాంటి కేసీఆర్ గారికి మీరెంత విష ప్ర‌చారం చేసినా.. ఏమీ కాదు. సీఎం కేసీఆర్ కు.. ఒక్క రాష్ట్రంలోనే కాదు ప్ర‌పంచవ్యాప్తంగా వెయ్యేనుగుల బ‌లంలా.. కోటాను కోట్ల అభిమానులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ గారు ఎక్క‌డికి వెళ్తున్నారు అనేది మీకెందుకు.. మీరేమైనా రాష్ట్ర ప్ర‌జ‌లు బాధలు, క‌ష్టాలు ఆర్చేవాల్లా??. తీర్చేవాల్లా??. రాష్ట్ర స‌మ‌స్య‌లు తీర్చేందుకు ఆరు ప‌దుల వ‌య‌సులోనూ.. ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్య‌కుండా.. కేసీఆర్ శ్ర‌మిస్తుంటే.. హాయిగా ఇండ్ల‌ళ్ల కూర్చుని.. మీ పెంట బుర్ర‌ల మెదిల్న‌వ‌న్నీ  రాస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌తీ ప‌నికి అడ్డం ప‌డుతూ.. ప్ర‌భుత్వ ముంద‌రికాళ్ల‌కు బంధం పోస్తున్నా.. ఎన్నో ముళ్ల కంచెల‌ను దాటుకుని దిగ్విజ‌యంగా ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు సీఎం కేసీఆర్. కానీ శ‌వాల పేలాలు ఏరుకున్న‌ట్లు.. మీ సైట్ వ్యూస్ కోసం.. మీ సైట్ల ప్ర‌చారం కోసం ఏకంగా ప్ర‌భుత్వ పెద్ద‌ల మీద ఏది ప‌డితే అది రాస్తాం అంటే కుద‌ర‌దు.
జ‌ర్న‌లిస్టులుగా బాధ్య‌త క‌లిగిన వ్య‌క్తులు ఐతే ఇలా చేయ‌రు. ఈ సైట్లను  న‌డుపుతున్న వాళ్లు నిఖార్సైన‌ జ‌ర్న‌లిస్టులు అని మేం అనుకోవ‌డం లేదు. ప్ర‌తిప‌క్షాల వాయిస్ వినిపిస్తూ.. వాళ్ల జెండాలు మోసే కార్య‌క‌ర్త‌లు…. కాదు.. కాదు.. అపొజిష‌న్ భ‌జ‌న ప‌రులు ఈ సైట్ ల  నిర్వాహ‌కులు. వార్త‌ను రాసేముందు.. ప్ర‌జ‌ల‌కు చెప్పేముందు.. దాంట్లో ఎంత వాస్తవం ఉంద‌ని తెలుసుకోలేనోళ్లు, మూర్ఖులు, అజ్ఞానులు.
Top