You are here
Home > Latest News > అబద్ధాలకు కేరాఫ్ కాంగ్రెస్

అబద్ధాలకు కేరాఫ్ కాంగ్రెస్

Spread the love

 

  • అబద్ధాల్లో కాంగ్రెస్ ను మించినవారున్నారా?.
  • మేనిఫెస్టో, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టి తెలంగాణ ఇవ్వని ఘనులు.
  • వందల మంది ఆత్మబలిదానాలకు కారకులు కాంగ్రెస్ నాయకులు.
  • ఇవాళ మీరు సీఎం కేసీఆర్ పై మాట్లాడుతున్నారా?.

తెలంగాణ కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎండనక.. వాననక పోరాడుతుంటే.. ఏనాడు నోరు మెదపని జైపాల్ రెడ్డికి కేసీఆర్ పేరు ఎత్తే అర్హతేలేదు. తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరితే.. తాను జాతీయవాదినంటూ తప్పించుకున్న అపరమేధావి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కేంద్ర పదవులు అనుభవిస్తూ పుట్టిన గడ్డకు ద్రోహం చేసి జైపాల్ రెడ్డికి.. తెలంగాణ గురించి కానీ.. సీఎం కేసీఆర్ గురించి కానీ.. మాట్లాడే అర్హత లేదు. మిస్టర్ జైపాల్ రెడ్డి,.. ఇక్కడి పుట్టి,.. ఇక్కడ పెరిగి.. ఇక్కడి ఓట్లతో గెలిచి కేంద్రంలో పదవులు అనుభవించి.. సొంతగడ్డకు చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా?.

సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారంటున్నవ్. కేసీఆర్ అబద్దాలు చెబితే.. తెలంగాణ రాలే. తెగించి కొట్లాడితే.. ప్రాణాలు పణంగా పెడితే తెలంగాణ వచ్చిందన్న సోయి తెచ్చుకో ముందు. అబద్ధాలు ఆడింది మీరు.. మీ పార్టీ నాయకులు. 2004లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని మేనిఫెస్టోతో పాటు.. రాష్ట్రపతి ప్రసంగంలోనూ చేర్చి.. తెలంగాణను నిలువునా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా?. వందలమంది చావుకు కారణం కాంగ్రెస్ పార్టీయే. వేలమంది జైలు పాలు అయ్యారంటే కారణం అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీయే.

జైపాల్ రెడ్డి.. తెలంగాణలో ఉండే అర్హతే లేదు. రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే.. 2009కి ముందే తెలంగాణ ఏర్పడేది. ఇప్పటి వరకు తెలంగాణ సుసంపన్నంగా వెలుగొందుతుండేది. అలా కాకుండా ఇప్పటికీ తెలంగాణ బాధలు పడుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు, పాపాలను టీఆర్ఎస్ కడుగుతూ వస్తోంది. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తోంది. వందలాది సంక్షేమ పథకాలు తెచ్చి.. వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. టీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోంది. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ మీద.. టీఆర్ఎస్ మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు.

Top