You are here
Home > Latest News > అబద్ధాల పునాదులపై.. జేఏసీ రాజకీయ రంగప్రవేశం! 

అబద్ధాల పునాదులపై.. జేఏసీ రాజకీయ రంగప్రవేశం! 

Spread the love

తెలంగాణ వచ్చింది. కలలు తీరుతున్నాయి. పనితీరుకు, సంక్షేమానికి, చిత్తశుద్ధికి మారు పేరుగా నిలుస్తున్న సంక్షేమ పథకాలు.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కానీ.. ఆ వెలుగులను చీకటిమయం చేసేందుకు.. కోదండరాం రూపంలో ఓ రాజకీయ విష కీటకం.. రంగం సిద్ధం చేసుకుంటోంది. గతంలో కోదండరాం తెలంగాణ కోసం ఏం ఉద్యమం చేసినా ముందుండి మద్దతు ఇచ్చిన కేసీఆర్ ను దోషిగా చూపేందుకు చేస్తున్న కుట్రలు తుది దశకు చేరాయి.

మేం ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం. కోదండరాం మాత్రం తనకు రాజకీయాలపై ఆసక్తి లేదంటున్నారు.. కానీ.. ఆయన చేసేవన్నీ రాజకీయ ప్రేరేపితాలే అని. ఇప్పుడు ఆ ఆరోపణలను నిజం చేస్తూ.. కోదండరాం తన జేఏసీకి వచ్చే నెల 20 లోపు స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తామంటున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికీ చిత్తశుద్ధితో పని చేస్తున్న టీఆర్ఎస్ ను అంతం చేసి.. జనాన్ని దోచుకుంటామని స్పష్టంగానే చెప్పేస్తున్నారు.

ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు తాము ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందంటూ.. తమ మనసులోని మాటను పరోక్షంగా బయటపెట్టుకుంటున్నారు. రాజకీయాల ముసుగులోనే స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేసుకుని.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండగా.. అసలు రంగులను కోదండరాం లాంటి జేఏసీ నేతలు బయటపెట్టుకుంటున్నారు. కానీ.. ఇలాంటి ప్రయత్నాలు.. జేఏసీకి మాత్రమే కాదు.. తమకూ ఎలాంటి మేలు చేయవని జనం నమ్ముతున్నారు.

కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప.. మరెవరినీ నమ్మేది లేదని స్పష్టం చేస్తున్నారు.

Top