You are here
Home > Digital Telangana > అభివృద్ధిని ఓర్వలేకపోతున్న కాంగ్రెస్!

అభివృద్ధిని ఓర్వలేకపోతున్న కాంగ్రెస్!

Spread the love
  • మల్లి షురువుఅయినాయి కాంగ్రెస్ కుట్రలు ..
  • తెలంగాణా ప్రభుత్వం అభివ్రుద్దిలో దూసుకు పోతుంటే ఓర్వలేక అబద్ధాలను ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ
  • ఇక ప్రజా క్షేత్రంలో మాకు నూకలు చెల్లినాయి అని గ్రహించే ఈ దుష్టమాటలు మాటలు ….

వాస్తవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వక్రీకరిస్తున్నారని గొంతు చించుకుంటున్న దాసోజు శ్రవణ్.. అవాస్తవాలు ఏంటో కూడా చెబితే జనం కూడా సంతోషిస్తారు. రాష్ట్రం ఏర్పడే నాటికి అరవై వేల కోట్ల రూపాయల అప్పులు ఉంటే.. ఇప్పుడు 90 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని.. దాంతో రాష్ట్రం అధోగతి పాలవుతోందనీ.. దాసోజు శ్రవణ్ చెప్పడం.. ఆయన అవగాహన రాహిత్యానికి ఓ ముచ్చటైన మచ్చుతునకగా చెప్పుకోవచ్చు.

నిజమే.. రాష్ట్రం అప్పులు తెస్తోంది. అలాగే.. అభివృద్ధి కూడా చేస్తోంది. మిషన్ కాకతీయతో వేలాది చెరువుల పూడిక తీయడంతో.. వందల టీఎంసీల నీళ్లు మన రాష్ట్ర రైతాంగానికి అందుబాటులోకి వచ్చాయి. అద్భుతంగా సాగు జరుగుతోంది. అలాగే.. ఇంటింటికీ నీళ్లు అందించేందుకు ఉద్దేశించిన వాటర్ గ్రిడ్.. మిషన్ భగీరథ ప్రాజెక్టు ఫలాలు.. దాదాపుగా పూర్తి స్థాయిలో ఈ ఏడాదే జనానికి అందబోతున్నాయి.

అంతే కాదు. కేంద్రం సహకరించకున్నా.. విపక్షాలు కోర్టుల్లో కేసులు వేస్తున్నా.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. కోట్లాది రూపాయల అప్పులనూ భరించి.. ఉత్తర తెలంగాణకు వర ప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయిస్తూ.. కేంద్ర జలవనరుల సంఘంతో కూడా శభాష్ అనిపించుకున్న ఘనత మన రాష్ట్రం సొంతం. ఇలా చెప్పుకుంటూ.. పోతే.. అప్పులను మించిన అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజల సొంతం అవుతున్నాయి. దాన్ని జీర్ణించుకోలేకనే.. దాసోజు శ్రవణ్ లాంటి నేతలు పనికిమాలిన మాటలతో.. జనం దృష్టిని మరల్చే కుట్ర చేస్తున్నారు.

కానీ.. కాంగ్రెస్ నేతలు చెబితే వినేందుకు.. అబద్ధాలను నిజాలని నమ్మేందుకు జనం మాత్రం సిద్ధంగా లేరు. అందుకే.. సర్కారు నుంచి అందుతున్న సంక్షేమ ఫలాలను అందుకుంటూనే.. మరోవైపు కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. అనువైన సమయం కోసం జనం ఎదురుచూస్తున్నారు. తగిన సమయంలో.. కాంగ్రెస్ ను.. ముఖ్యంగా దాసోజు శ్రవణ్ లాంటి అబద్ధాల కోరులను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Top