You are here
Home > Latest News > అమిత్ షా.. ఎవడు అడిగిండు నీతో పొత్తు కావాలని?

అమిత్ షా.. ఎవడు అడిగిండు నీతో పొత్తు కావాలని?

Spread the love

 

  1. బొక్కబోర్లా పడేందుకు సిద్ధమవుతున్న కమలం శ్రేణులు
  2. ఉన్న ఐదు సీట్లనూ కోల్పోయే ప్రమాదం
  3. స్వయంకృతాపరాధంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు

 

కేసీఆర్ తో కయ్యమే.. మా మధ్య ఎలాంటి ఒప్పందం లేదు -అమిత్ షా

ఎవడు అడిగాడండీ బీజేపీ నేతలతో పొత్తు కావాలని? ఏనాడైనా టీఆర్ఎస్ నేతల నుంచి కానీ, అధ్యక్షుడి నుంచి కానీ అలాంటి మాట కానీ అభిప్రాయం కానీ వినిపించిందా? నాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పారు.. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు బూచి చూపించి తెలంగాణను మోసం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక అదే చంద్రబాబు బూచి చూపించి ఏడు మండలాలను అన్యాయంగా బలి చేశారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కూడా.. తెలంగాణకు హక్కుగా ఇచ్చే నిధులే తప్ప.. పైసా అదనంగా ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఇంతటి కుట్రలు చేస్తున్న బీజేపీతో తెలంగాణ సమాజం ప్రతినిధి టీఆర్ఎస్ ఎలా పొత్తుకు ఆరాటపడుతుంది? ఆ దిశగా అమిత్ షా ఎందుకు కామెంట్లు చేస్తున్నాడు? కేసీఆర్ ను తిడితే తెలంగాణలో ఓట్లు పడతాయని ఆయన భ్రమ పడితే.. అంతకన్నా పెద్ద తప్పు మరోటి ఉండదు.

ఐదు రాష్ట్రాల్లోనూ తమకు అనుకూల ఫలితాలే వస్తాయని అమిత్ షా మరో పగటి కల కూడా కనేస్తున్నాడు. కానీ.. రాజస్థాన్ తో పాటు.. ఇంకొన్ని ప్రాంతాల్లో ఈ సారి బీజేపీ ఓటమి ఖాయమన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోనూ టీఆర్ఎస్ కే మళ్లీ అధికారం ఖాయమని సర్వేలు కోడై కూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో.. ఉన్న బలాన్ని కూడా నీరుగార్చేలా అమిత్ షా వ్యవహరిస్తుండడం.. ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు.

పిచ్చి మాటలు.. పగటి కలలు మానకుంటే.. ఉన్న ఐదు సీట్లు కాదు కదా.. అసలు ఖాతా కూడా తెరవనంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకోవాల్సి వస్తుందని పువ్వు పుల్కాలు ఆందోళన చెందుతున్నారు. ఆ విషయం అమిత్ షా కు ఎప్పుడు అర్థమవుతుందో.. పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన ఎప్పుడు మారతాడో చూడాలి.

Top