You are here
Home > Latest News > అమిత్ షా.. తెలంగాణలో మీకు అంత సీన్ ఉందా??

అమిత్ షా.. తెలంగాణలో మీకు అంత సీన్ ఉందా??

Spread the love

 

 

  • – పూర్తి స్థాయి భ్రమిత్ షా గా మారిపోయిన అమిత్ షా
  • – తమ స్థాయిని అతిగా ఊహించుకుంటూ పగటికలలు
  • – తీరు మార్చుకోకుంటే పరాభవం తప్పదంటున్న విశ్లేషకులు

ఆ మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను.. మంత్రి కేటీఆర్ భ్రమిత్ షా అని అన్నప్పుడు కొందరు నవ్వుకున్నారు. ఇంకొందరేమో కేటీఆర్ భలే చమత్కారంగా సెటైర్ వేశారే అని అనుకున్నారు. కానీ… ఇది నవ్వుకోవాల్సిన జోకూ కాదు.. సెటైర్ అంతకన్నా కాదూ అని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. కేటీఆర్ చెప్పింది అక్షర సత్యమన్న మాటను… స్వయంగా అమిత్ షా నే నిరూపించుకోవడం.. బీజేపీ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.

ఎలాగూ గెలిచే అవకాశం లేదు. అంత బలం, బలగం కూడా లేదు. అయినా.. ఒకటో రెండో సీట్లు కావాలంటే కేసీఆర్ ను తిట్టాలి.. అలా అయితేనే సీట్లు సాధించగలం అన్నట్టుగా అమిత్ షా ప్రవర్తిస్తున్నారు. ఈ దిశగా కరీంనగర్ సభలో మాట్లాడిన ఆయన.. మోదీకి భయపడే ముందస్తుకు వెళ్లారు అయిన కేసీఆర్ గురించి ఓ చవకబారు కామెంట్ చేశారు. కానీ అసలు వాస్తవం ఇదీ అంటూ అమిత్ షాకు తెలంగాణ ప్రజలు చురకలు అంటిస్తున్నారు.

నాలుగు రోజులకు ఒక పథకం అన్నట్టుగా కేసీఆర్ ముందుకు పోతుంటే.. దేశానికి ఆదర్శవంతమైన అభివృద్ధిని, పరిపాలనను అందిస్తుంటే కళ్లు కుట్టిన కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇన్నాళ్లూ తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలనకు ఆటంకాలు కలిగించారు. ప్రాజెక్టులు అడ్డుకున్నారు. పథకాలు నిలిచిపోయేలా చేశారు. నియామకాలకు అడ్డం పడ్డారు. ఇలా ఇంకెంతకాలం భరించాలన్న కారణంతోనే… ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం అభాసుపాలవుతుందన్న ఆవేదనతోనే.. కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు తప్ప.. ఎక్కడో ఢిల్లీలో రాజకీయాలు చేసే మోడీ గురించి మాత్రం కాదు.

అయినా.. మోడీ గురించి ఆలోచించేందుకు అంతగా ఏముందని? ఇచ్చిన హామీలను ఎలాగూ నెరవేర్చలేదు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండనే ఉంది. పైగా తెలంగాణకు ఏమీ చేయలేని ప్రధాని. అలాంటి వ్యక్తి గురించి కేసీఆర్ ఆలోచించడమా? నెవ్వర్. అది జరిగే పనే కాదు. కచ్చితంగా తెలంగాణ ప్రజల మేలు కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కేసీఆర్ ను గెలిపించేందుకు ప్రజా శక్తులన్నీ ఏకమవుతున్నాయి. అమిత్ షా కాదు కాదా.. ఆయన తల్లో జేజమ్మ వచ్చినా టీఆర్ఎస్ గెలుపును, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడాన్ని అడ్డుకోలేరు.

Top