You are here
Home > Latest News > అయ్యా చంద్రబాబు.. 2015లో జీవో రిలీజ్ చేస్తే.. ఇప్పుడెందుకు లొల్లి చేస్తున్నావు..

అయ్యా చంద్రబాబు.. 2015లో జీవో రిలీజ్ చేస్తే.. ఇప్పుడెందుకు లొల్లి చేస్తున్నావు..

Spread the love

 

  • 2019లో గుర్తొచ్చిందా నీకు ఆ బిల్లు
  • అన్నీ తెలిసి టీఆర్‌ఎస్‌తో ఎందుకు పొత్తు పెట్టుకుందామనుకున్నావు మరి..
  • ఆపరా బాబు మీ సొల్లు పోస్టులు..
చంద్రబాబుకు రాత్రికి రాత్రే కలొస్తది. అప్పుడే ఆ కలలోనే అన్నీ కనిపిస్తయి. ఆయన అపర భగీరధుడిలా ఆయనకు ఆయనే కనిపిస్తడు. కేసీఆర్, జగన్, మోదీ.. వీళ్లంతా ఆయనకు కాదు.. ఏపీకి ద్రోహం చేసినట్టు కనిపిస్తది. అందుకే.. తెల్లారి లేసి.. ఇది పచ్చ మీడియాను ఉసిగొల్పి.. ఇలా జగన్‌పై, కేసీఆర్‌పై బురద జల్లిస్తుండు. బాబూ చంద్రబాబు. నిజంగా 2015లో తెలంగాణ ప్రభుత్వం ఆ జీవోను ఇచ్చి ఉంటే.. నువ్వు ఇన్నేండ్లు ఏం పీకినట్టు. అప్పుడే ఎందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయలేదు. దాని కోసం 2019 ఎన్నికల దాకా ఆగాలా? ఇదేనా నీకు ఏపీ ప్రజల మీద ఉన్న ప్రేమ.
దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కదా.. నువ్వు ఎటువంటి వ్యక్తివో. నీకు నిజంగా ఏపీ ప్రజల మీద ప్రేమ ఉంటే.. అప్పుడే మీడియా సమావేశం పెట్టి.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నదో అడగొచ్చు కదా. అప్పుడు చప్పుడు చేయకుండా కూర్చొని.. మధ్యలో టీఆర్‌ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధమయి.. అది బెడిసి కొట్టేసరికి.. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వచ్చే సరికి.. కేటీఆర్.. జగన్‌ను కలిసేసరికి.. నీకు ఎక్కడ ఎసరు పెడుతారో అని… ఇలా పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దించావా? అబ్బబ్బ.. నీ తెలివి తెల్లారా? నువ్వొక్కడివే తెలివికల్లోడివి అనుకుంటావా? బాబు.. మిగితా వాళ్లంతా తెలివితక్కువ వాళ్లనా నీ ఆలోచన.
నీకు నిజంగా దమ్ముంటే.. నువ్వేదైతే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నావో.. 26 బీసీ కులాలను జాబితా నుంచి తీసేశారంటూ విమర్శిస్తున్నావో.. దాన్ని మీడియా ముందు పెట్టి నిరూపించు. అంతే కానీ.. పచ్చ బ్యాచ్‌తో సోషల్ మీడియాలో రెచ్చిపోవడం ఏంది. దాని వల్ల ఏమొస్తది. ఏం రాదు. అలా బురద జల్లినంత మాత్రాన.. నీ మీద ఏపీ ప్రజలకు ప్రేమ పుట్టుకొస్తుందనుకుంటున్నావా? నిన్ను గెలిపిస్తారనుకుంటున్నావా? దేనికి నీ ఏడుపు. అధికారం కోసం ఏదైనా చేస్తావా? ఎవ్వరినైనా బదనాం చేస్తావా? అయినా.. సోషల్ మీడియాలో కాదు నీ ప్రతాపం.. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రా.. మాట్లాడు. అప్పుడు తెలుస్తుంది కదా.
Top