You are here
Home > Latest News > అరుణమ్మా.. సభ తర్వాత తెలుస్తుంది కాంగ్రెస్ సంగతి!!

అరుణమ్మా.. సభ తర్వాత తెలుస్తుంది కాంగ్రెస్ సంగతి!!

Spread the love

 

పిచ్చి కూతల కారణంగానే.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజల్లో ఎన్నడో చచ్చిపోయింది. అధికారానికి దూరమై.. భవిష్యత్తు ఏంటో అర్థం కాక.. కేడర్ ను కూడా నాయకత్వం అయోమయంలో పడేస్తోంది. ఇలాంటి సందిగ్ధ సమయంలో.. డీకే అరుణ లాంటి సీనియర్ నేతలు కూడా చేసిన తప్పునే చేస్తుండడం.. కాంగ్రెస్ శ్రేణులకు మతి పోగొడుతోంది.

ఓ వైపు రంగరంగ వైభవంగా కొంగర కలాన్ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షల మంది జనం సభకు హాజరు అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్ఎస్ పై.. కేసీఆర్ పరిపాలన తీరుపై తమ అభిమానాన్ని చాటుకుంటనేందుకు ఆరాటపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో.. టీఆర్ఎస్ నేతలకు తమపై తమకే విశ్వాసం లేదని డీకే అరుణ అంటుండడం… దేనికి సంకేతమో కాంగ్రెస్ నేతలే అర్థం చేసుకోవాలి.

నాలుగేళ్లుగా ఎంతో చేశారు. చెప్పినదే కాదు.. చెప్పని హామీలను కూడా అమలు చేస్తున్నారు. దేశానికే పరిపాలనలో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను తక్కువ చేసి మాట్లాడుతూ.. కోరి కోరి ప్రజాగ్రహాన్ని కొని తెచ్చుకుంటున్నారు… డీకే అరుణ. అందుకే.. ప్రగతి నివేదన సభ కానివ్వండి… ఆ తర్వాత మీ సంగతి చెప్తాం అని ప్రజలు కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నోరు జాగ్రత్త అని స్పష్టం చేస్తున్నారు.

Top