You are here
Home > Latest News > అలా అయితే ఎప్పుడో ముందస్తు వచ్చేది!

అలా అయితే ఎప్పుడో ముందస్తు వచ్చేది!

Spread the love

 

  • – ఎన్నికలపై కాంగ్రెస్ అవాకులు చెవాకులు
  • – కేసీఆర్ సత్తాపై అసంబద్ధ వ్యాఖ్యలు
  • – గెలుస్తామంటూ ప్రతిపక్షంలో అతి విశ్వాసం

కాంగ్రెస్ పార్టీ నేతలు కోరి కోరి ఓటమిని కొనితెచ్చుకునేలా ఉన్నారు. ముందస్తు ఎన్నికలపై ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు… జనానికి మాత్రమే కాదు. స్వయానా సొంత పార్టీ శ్రేణులను కూడా చికాకుపరుస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సలీమ్ అహ్మద్ మాట తీరు కూడా ఇలాంటి ఫలితాన్నే అందిస్తోంది. పాలనాపరమైన అంశాల గురించి సీఎం కేసీఆర్ డిల్లీలో ప్రధాని మోడీని కలిస్తే… అది ఎందుకో చెప్పాలని సలీమ్ అహ్మద్ నిలదీయడం… ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం.

మరో విషయం ఏంటంటే… రాష్ట్రంలో రాహుల్ సభ తర్వాతే కేసీఆర్ లో అభద్రతా భావం పెరిగిందట. వింటే ఎవరైనా దేంతో నవ్వుతారో కూడా అర్థం కావడం లేదు. అధ్యక్షుడయ్యాక ఒక్కటంటే ఒక్క చోట కూడా పూర్తి స్థాయి విజయాన్ని అందుకోలేకపోతున్న చేతగాని దద్దమ్మ రాహుల్ ఎక్కడ. ఏ ఎన్నికలో పోటీ చేసినా రికార్డు మెజారిటీలతో విజనాన్ని సాధించిపెడుతున్న కేసీఆర్ ఎక్కడ. అసలు ఆయనకు ఈయనకూ పోలికా?

ముందు… ఏదైనా ఒక రాష్ట్రంలో నేరుగా గెలిచి చూపించమనండి మీ రాహుల్ ను. ఆ తర్వాత మాట్లాడుదురుగని. చేతగాని నాయకుడు చూపే మార్గంలో నడుస్తున్న కాంగ్రెస్ నాయకులారా… ఒక్కటి గుర్తుంచుకోండి. సలీమ్ అహ్మద్ కాదు. ఇంకెవరో కాదు. మీ నాయక గణం తరలివచ్చినా కూడా టీఆర్ఎస్ ను కదపలేరు. ఆ పార్టీ విజయాన్ని ఆపలేరు. కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేరు.

Top