You are here
Home > Uncategorized > అలా మోసం చేసే.. అధికారంలోకి వచ్చారుగా లక్ష్మణ్!!

అలా మోసం చేసే.. అధికారంలోకి వచ్చారుగా లక్ష్మణ్!!

Spread the love

మోడీని చూపించి.. గారడీ విద్య ప్రదర్శించేందుకు బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. కేంద్రంలో 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీయే ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో బీజేపీని గెలిపిస్తే.. ఆ గెలుపు పుణ్యం సోషల్ మీడియాదే అన్నట్టు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఆ వాపును చూపిస్తూ.. తమ బలుపును చాటుకునేందుకు ఆరాటపడుతున్నారు.

రాష్ట్రంలో బూత్ స్థాయి వరకూ బీజేపీ ఐటీ సెల్ ను విస్తరించాలంటూ.. పార్టీ వర్క్ షాప్ లో పిలుపునిచ్చిన లక్ష్మణ్ కు.. ఇంకా వాస్తవాలు మాత్రం అర్థం కావడం లేదన్న విషయం సులువుగానే అర్థమవుతోంది. దేశ వ్యాప్తంగా ఎన్నిసార్లు ఎన్నిచోట్ల ఎన్నికలు జరిగినా… బీజేపీ నేతలకే మంచి ఫలితాలు వస్తుండవచ్చు. కానీ.. రాష్ట్రంలో 2014 నుంచి మొదలు పెడితే.. ఇప్పటివరకూ టీఆర్ఎస్ జైత్రయాత్రను.. జనాలు ఆపేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. ఏ ఎన్నిక జరిగినా.. టీఆర్ఎస్ కే పట్టం కడుతున్నారు. ఇకపై కూడా.. కేసీఆర్ నే తమ నాయకుడిగా అంగీకరిస్తామని చెబుతున్నారు.

ఇలాంటి తరుణంలో ఏ మోడీ వచ్చినా.. ఎంతటి అమిత్ షా వచ్చినా.. జనాల్లో టీఆర్ఎస్ కు ఉన్న ప్రజాదరణను వెంట్రుక మాత్రం కూడా కదిలించలేరు. అంతటిదానికి బూత్ స్థాయిలో ఐటీ సెల్ ను విస్తరిస్తాం.. మరింత బలపడతాం.. అంటే ఎలా సాధ్యమో లక్ష్మణ్ ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ కేసీఆర్ ను మించి.. జనాల్లో ఎలా బలపడతాం అన్నది ఆలోచించాలి గానీ.. అంతగా ఫలితాన్ని ఇవ్వని ఐటీ.. సోషల్ మీడియా అని తాత్సారం చేస్తే.. బీజేపీ నేతలకే నష్టం తప్ప.. ఇంకెవరికీ కాదు.. అని జనాలు స్పష్టం చేస్తున్నారు.

Top