You are here
Home > Latest News > అసలు నీ బాధేంది పొంగులేటి సుధాకర్ రెడ్డి…?

అసలు నీ బాధేంది పొంగులేటి సుధాకర్ రెడ్డి…?

Spread the love

 

  • ఏం చెప్పాలనుకుంటున్నావు తెలంగాణ సమాజానికి..?
  • బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం సీఎం కేసీఆర్ పడని పాట్లు లేవు..
  • మైకు ముందు ఏదో ఒకటి వాగినంత మాత్రాన బయ్యారం ఫ్యాక్టరీ వచ్చేస్తదా చెప్పు…

కాంగ్రెస్ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి.. ఈయన బాధేందో అర్థమవట్లేదు. మైకు ముందు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు నోరు మెదపని ఈయన ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండగా తెలంగాణ ప్రభుత్వంపై బట్ట కాల్చి మీదేస్తున్నాడు. ఇదేనా పొంగులేటి నువ్వు కాంగ్రెస్ నుంచి నేర్చుకున్నది.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం కేసీఆర్ కేంద్రంతో ఎన్నోసార్లు మాట్లాడారు. కాళ్లరిగేలా కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ నీకు తెలియవా? కావాలని సీఎం కేసీఆర్ మీద బురద జల్లుతున్నావా? ప్రధాని మోదీని కలిసిన ప్రతి సారి బయ్యారం ఫ్యాక్టరీ గురించి చర్చిస్తున్నారు సీఎం. బయ్యారం ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై కేంద్రానికి వివరిస్తున్నారు. మంత్రి కేటీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల బృందం కూడా బయ్యారం ఫ్యాక్టరీ గురించి కేంద్రానికి విన్నవించింది. కానీ.. కేంద్రం మాత్రం నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్నది.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. కేంద్రం కాదన్నా కూడా ఫ్యాక్టరీని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. సాక్షాత్తూ మంత్రి కేటీఆరే ఈ విషయాన్ని స్పష్టీకరించారు. తెలంగాణ సంక్షేమం కోసం అహర్నిషలు పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం నిజంగా నీకు సిగ్గు చేటు.

నీకు దమ్ముంటే.. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలపై మీకు మమకారం ఉంటే వెళ్లి కేంద్రాన్ని నిలదీయండి. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని అడగండి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఎందుకు నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్నదో వెళ్లి అడగండి. అంత దమ్ముందా మీకు. కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులైనా ఎప్పుడైనా తెలంగాణ సంక్షేమం గురించి పట్టించుకున్నారా? లేదు. కాని.. మీరు మాత్రం మైకుల ముందు తెగ వాగేస్తారు. కనీసం మీ పార్టీ నేతలను కూడా ఒప్పించేంత సామర్థ్యం లేదు మీకు. మీరు తెలంగాణ ద్రోహులు. మీరు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే మిమ్మల్ని తెలంగాణ నుంచి తరిమి తరిమి కొడితేనే తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది.

Top