You are here
Home > Latest News > అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినయ్.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల మీద పడ్డవా ఉత్తమ్..

అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినయ్.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల మీద పడ్డవా ఉత్తమ్..

Spread the love

  • తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే లేదు అంటే సన్నద్ధం అట..
  • 2014లోనే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టారు ప్రజలు..
  • పంచాయతీ, లోక్ సభ ఎన్నికల్లోనూ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఘోరంగా ఓడిస్తారు.

అవును… సిద్ధం కావాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మళ్లీ ఘోరంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి ఉత్తమ్ కుమార్ రెడ్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోయిందని నిన్నకాక మొన్ననే కదా తెలిసింది. 2014లోనూ తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీని అడ్డంగా తిరస్కరించాడు. అయినా.. సిగ్గు లేకుండా తెలంగాణను మళ్లీ దోచుకుతిందామని ఈసారి ఎన్నికల్లో ఓట్లడుక్కున్నారు. కానీ.. ఏమైంది.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా ఓడించారు. సిగ్గుందా మీకు. అయినా మీకు బుద్ధి రావడం లేదా ఉత్తమ్.

అందుకే.. మళ్లీ సిద్ధం కండి.. ఈసారి పంచాయతీ, తర్వాత వచ్చే లోక్ సభ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఘోరంగా ఓడిస్తారు. అదే జరగబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ ఓటరు మిమ్మల్ని తిరస్కరించబోతున్నాడని చెబితే మీరు నమ్మలేదు కదా. పైగా కూటమి అంటూ పనికిమాలిన పార్టీలన్నీ కలిసి కూటమిని ఏర్పాటు చేసి తెలంగాణను దోచుకుతిందామనుకున్నారు. ఆంధ్రాకు పోయి.. ఆ ఆంధ్రా బాబును తెలంగాణను పట్టుకొచ్చి తెలంగాణలో పాగా వేద్దామనుకున్నారు. మీ కుయుక్తులన్నింటినీ తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారు.

ఇదివరకులా మీ చేతిలో వాళ్లు ఇక మోసపోవాలనుకోవట్లేదు. 40 ఏళ్లు తెలంగాణను పాలించి మీరు తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదు. 40 ఏళ్ల పాలనలో తెలంగాణను అడ్డంగా దోచుకుతిన్నారు. అది చాలలేదా. ఇంకా దోచుతిందామనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలేమన్నా అమాయకులా? మీ కుయుక్తులు ఇక సాగవు. మీరు ఓటములనే చవిచూస్తారు ఇక.

Top