You are here
Home > Latest News > అసెంబ్లీ క‌ట్టుకునే హ‌క్కు కూడా  లేదా ?

అసెంబ్లీ క‌ట్టుకునే హ‌క్కు కూడా  లేదా ?

Spread the love
  • అసెంబ్లీ క‌ట్టుకునే హ‌క్కు కూడా  లేదా ?
  • ఎర్ర‌మంజిల్ తీర్పుపై న్యాయ‌నిపుణుల విస్మ‌యం
  • కోర్టుది అన‌వ‌స‌ర‌మైన జోక్య‌మ‌ని విమ‌ర్శ‌లు

కోర్టులు అతి క్రియాశీలకంగా (ఓవ‌ర్ ప్రొయాక్టివ్‌) వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న‌డానికి తాజాగా ఎర్ర‌మంజిల్ తీర్పే ఉదాహ‌ర‌ణ‌. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ప్ర‌భుత్వ కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేయ‌డం నిజంగా దుర‌దృష్టం. ఎర్ర‌మంజిల్ హెరిటేజ్ భ‌వ‌నం లిస్టు నుంచి తీసేశామ‌ని చెప్పినా గౌర‌వ న్యాయ‌స్థానం ప‌ట్టించుకోలేదు. అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను కూల్చి వేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకొంటే తప్పేంటో కోర్టుకే తెలియాలి. పాత రాష్ర్టాలే కొత్తగా అసెంబ్లీ భవనాలు కట్టుకొంటున్నప్పుడు.. కొత్త రాష్ట్రంలో అభ్యంతరాలు ఎందుకు?

దశాబ్దాల కిందట నిర్మించిన భవనాలు ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా లేవు. అటు ఎర్ర‌మంజిల్‌, ఇటు అసెంబ్లీ.. ఏ క్ష‌ణ‌మైన కూలిపోయే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే ఇవి రెండూ పురాత‌న భ‌వ‌నాలు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త భవనాలు అవసరం. పాలనలో ప్రభుత్వం తన మార్కును చూపించాలనుకోవడంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. పాత రాష్ర్టాల్లో కొత్త అసెంబ్లీ భవనాలు కట్టుకున్నారు. ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో కొత్త భవనాలు కట్టుకొన్నారు.

మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత భోపాల్‌లో కంటే పెద్దదైన అసెంబ్లీ భవనాన్ని జైపూర్‌లో నిర్మించారు. తద్వారా తమ ఉనికి, తాము ఇక్కడ ఉన్నాం.. అనే సందేశాన్ని పంపారు. భారత స్వాతంత్య్ర పోరాటం స్థాయిలో అనలేం కానీ, భారీస్థాయిలో సుదీర్ఘ పోరాటాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొన్నారు. అలాంటి రాష్ట్రంలో అసెంబ్లీ భవనం కట్టడం తప్పెలా అవుతుంది? ప్రభుత్వం పాలనతో తమ మార్కును చూపించాలనుకోవడంపై అభ్యంతరాలు ఎందుకు ఉండాలి? అసెంబ్లీ నిర్మాణాన్ని అడ్డుకోవ‌డం ద్వారా పిటిష‌న‌ర్లు ఏం సాధించారో అర్థం కావ‌డం లేదు. ఇంత‌కీ ఈ పిటిష‌న్ల వెనుక ఎవ‌రున్నారు ? ఒక్క క్ష‌ణం ఆలోచించండి. మీకే అర్థ‌మ‌వుతుంది!!

Top