You are here
Home > Latest News > ఆఖరకు దేవుని దగ్గర అబద్దాలేనా పొన్నం ..??

ఆఖరకు దేవుని దగ్గర అబద్దాలేనా పొన్నం ..??

Spread the love

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నవు.. నువ్వసలు మనిషివేనా పొన్నం

ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం వందశాతం దృఢ నిశ్చయంతో ఉంది..

ఆలయ పునర్నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది..

మీ హయాంలో బాసర అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది…

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నడు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. అసలు.. నువ్వు ఏం మాట్లాడుతున్నవో నీకైనా అర్థం అవుతున్నదా? సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. తెలంగాణ ఇంచు ఇంచు అభివృద్ధి చేసి చూపిస్తరు. ఇప్పటికే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. ఇదంతా కేవలం నాలుగేండ్లలోనే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలంగాణను పట్టించుకులేదు. మీరు చేసిందేముంది. ఏమీలేదు. మీ పొట్ట నింపుకున్నారు. ఇప్పుడు అధికారం లేక అలమటిస్తున్నరు.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కోసం ఆగమశాస్త్ర పండితులతో చర్చించింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే మాస్టర్ ప్లాన్ రెడీ అయితే.. ఆలయ అభివృద్ధి పనులు చకచకా జరగనున్నాయి. ఆలయ పునర్నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బాసర ఆలయం అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. మీరు పరిపాలించినప్పుడు గుర్తుకు రాలేదా బాసర. మీ హయాంలో బాసర అమ్మవారి క్షేత్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. దాన్ని కేసీఆర్ ప్రభుత్వం గాడికి తీసుకొచ్చింది. అడుగడుగునా సిబ్బంది, అర్చకులు, ఇతరులు అమ్మవారి ఆదాయానికి గండి కొట్టారు. నిబంధనలకు పాతరేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బాసరపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న బాసర క్షేత్రాన్ని నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు పొన్నం. నువ్వు ఏం చేసినా.. నీ పాచికలు ఇక పారవు. నువ్వు, నీ పార్టీ నేతలంతా పారిపోవడానికి సిద్ధంగా ఉండండి. లేదంటే.. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని తరిమితరిమి కొడతారు.

Top