You are here
Home > Latest News > ఆత్మ‌హ‌త్య‌లు కాదు.. ఆలోచ‌నలు కావాలి

ఆత్మ‌హ‌త్య‌లు కాదు.. ఆలోచ‌నలు కావాలి

Spread the love
  • ఆత్మ‌హ‌త్య‌లు కాదు.. ఆలోచ‌నలు కావాలి
  • ఇది ఆర్టీసీని ర‌క్షించే ప్ర‌భుత్వం..భ‌క్షించేది కాదు
  • ఖ‌మ్మం ఘ‌ట‌న క‌చ్చితంగా రాజ‌కీయ ప్రేరేపిత‌మే
  • తెరాస టికెట్ రానందుకే అశ్వ‌త్థామ రెడ్డి స‌మ్మెబాట‌

 

స‌మైక్య పాల‌కుల స్వార్థం కార‌ణంగా స‌ర్వ‌నాశ‌మైన ఆర్టీసీని ర‌క్షించ‌డానికి కేసీఆర్ ప్ర‌భుత్వం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. వాళ్ల‌కు ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఐఆర్ ఇచ్చారు. కొత్త బ‌స్సులు కొన్నారు. ఆదాయం పెంచారు. ప‌లుసార్లు నిధులూ కేటాయించారు. ఇప్పుడు ఆర్థిక‌మాంద్యం దారుణంగా ఉంది. జీతాల‌కే డ‌బ్బులు చాల‌డం లేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆర్టీసీ విలీనం ఎలా సాధ్య‌మ‌వుతుంది ? మ‌ళ్లీ కొత్త బ‌స్సులు కొనాల‌నే డిమాండ్ పెట్ట‌డం అర్ధ‌ర‌హితం కాదా ? ఏపీలో మిన‌హా ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌లేదు. ఇక్క‌డ మాత్రం ఎలా సాధ్య‌ప‌డుతుంది ? ఇవ‌న్నీ ఆర్టీసీ కార్మికుల‌కు విడ‌మ‌రిచి చెప్పాల్సిన నాయ‌కులు కార్మికుల‌ను రెచ్చ‌గొడుతున్నారు.

 

వారి జీవితాల‌తో ఆట‌లాడుకుంటున్నారు. వారిని ఆత్మ‌హ‌త్య‌ల‌కు రెచ్చ‌గొడుతున్నారు. ఆర్టీసీని పూర్తిగా అంధ‌కారంలోకి నెట్టే కుట్ర‌లు జ‌రుగుతున్నాయి. నిన్న ఖ‌మ్మంలో జ‌రిగిన సంఘ‌ట‌న అలాంటిదే! నాయ‌కులు రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే శ్రీ‌నివాస రెడ్డి అనే డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేశాడు. ఆర్టీసీ కార్మికుల జీవితాల‌ను ఫ‌ణంగా పెట్టి రాజ‌కీయంగా ఆర్థికంగా ఎద‌గ‌డానికి కొన్ని రాజ‌కీయ‌, అసాంఘిక శ‌క్తులు కాచుకొని ఉన్నాయి. వారి జీవితాలు మండుతుంటే చ‌లికాచుకోవ‌డానికి గుంట‌న‌క్క‌లు పొంచి ఉన్నాయి.  కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కసారే 42% ఫిట్ మెంట్ ఇచ్చారు…. ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్ మెంట్ ఇవ్వడంతో పాటు మరోసారి 16% ఐ ఆర్ కూడా ఇచ్చారు…. అయినా ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ అకస్మాత్తుగా డిమాండ్ ను తెరమీదికి తెచ్చి దసరా పండుగ ముందు సమ్మె చేయడం చాలా పెద్ద త‌ప్పు.

వనపర్తి టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే టికెటో, ఎమ్మెల్సీ నో ఇవ్వలేదని కేసీఆర్ మీద కోపంతో అశ్వత్థామ‌ రెడ్డి 50  వేల మంది కార్మికుల జీవితాలను బలి పెడుతున్నాడు. ఇత‌ణ్ని కాంగ్రెస్‌, బీజేపీలు రెచ్చ‌గొట్టాయి. వీళ్లంతా క‌లిసి కార్మికుల జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నారు. అందుకే ఆర్టీసీ కార్మికులు మేలుకోవాలి. యూనియ‌న్ నాయ‌కుల ఉచ్చు నుంచి బ‌య‌ట‌కు రావాలి. నిజాలు తెలుసుకోవాలి. ప్ర‌జ‌ల‌ను ఇబ్బందిపెట్ట‌డం మాని ఉద్యోగాలు చేరితే బంగారు భ‌విష్య‌త్ ఉంటుంది. ఆత్మ‌హ‌త్య‌ల‌తో అశాంతి త‌ప్ప ఏమీ ఉండ‌దు.

Top