You are here
Home > Latest News > ఆర్కే.. ఏపీలో డాక్టర్లు డెలివరీ ఎలా చేస్తున్నారు..

ఆర్కే.. ఏపీలో డాక్టర్లు డెలివరీ ఎలా చేస్తున్నారు..

Spread the love

 

  • నీకు తెలంగాణ ఒక్కటే కనిపిస్తుందా? ఏపీ కనిపించడం లేదా?
  • పోనీ.. గత ప్రభుత్వాల హయాంలో డెలివరీలు ఎలా జరిగాయో నీకు తెలియదా?
  • తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెరుగుతుంటే నువ్వేమో ఇటువంటి పనికిమాలిన కథనాలు వడ్డిస్తున్నావా?

ఆర్కే… సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం అనేది ఇప్పుడే కొత్తగా వచ్చిందా? నిన్నమొన్ననే వచ్చిందా? అసలు.. ఇదివరకు నార్మల్ డెలివరీలేనా? తెలంగాణ వచ్చినంకనే సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారా? తెలంగాణ రాకముందు అసలు సిజేరియన్ ఆపరేషన్లంటేనే జనాలకు తెలియదా ఆర్కే. ఏపీలో కూడా ఏ హాస్పిటల్ లో చూసినా నార్మల్ డెలివరీలేనా? అస్సలు సిజేరియన్ చేస్తలేరా అక్కడ. లేక ఏపీలో నీ కళ్లు మూసుకుపోయాయా?

రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు పెరిగాయని అనుకోవడం నీ భ్రమ. కేసీఆర్ కిట్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. అవి కూడా నార్మల్ డెలివరీలు. సిజేరియన్లు చాలామటుకు తగ్గాయి. ప్రభుత్వాసుపత్రులు కూడా ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో ఉన్నాయి. కేసీఆర్ కిట్ అనే పథకం బ్రహ్మాండమైన పథకమని.. దాని వల్ల నార్మల్ డెలివరీలు పెరగడంతో పాటు.. గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం.. అనేది తల్లీబిడ్డ ఇద్దరికీ క్షేమమని.. ఇటువంటి పథకం తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలో లేదని దేశమంతా పొగుడుతుంటే… నువ్వేమో.. సిజేరియన్ ఆపరేషన్లు పెరిగాయని చెప్పడం దేనికి సంకేతం.

పోనీ.. నీ ప్రియ మిత్రుడు చంద్రబాబు పాలిస్తున్న ఏపీలో డెలివరీల పరిస్థితి ఎలా ఉంది? మరి.. దాని మీద ఎందుకు వార్తలు రాయవు. ఇదేం పక్షపాత ధోరణి. అసలు.. ఈ బర్త్ పోర్టల్ లోని డేటా యాక్సెస్ అనేది ప్రభుత్వానికి తప్ప మరొకరికి ఉండదు. ఆసుపత్రులు కూడా ఆ డేటాను వేరే వాళ్లకు ఇవ్వవు. అసలు ఆ డేటా మీకు ఎలా వచ్చింది. ఆ డేటా మీ వరకు వచ్చే సమస్యే లేదు. అంటే.. ఆర్కే.. నువ్వు ఓ రాయి వేశావన్న మాట. ఈ బర్త్ పోర్టల్ పేరు చెప్పుకొని.. ఎందుకు ఇలా తెలంగాణ ప్రభుత్వం మీద బురద జల్లడం.

సరే.. ఒక వేళ సిజేరియన్లే పెరిగాయనుకుందాం. అది ఎప్పుడు ఈ రెండునెలల్లో అని నువ్వే చెబుతున్నావు కదా. ఒక రెండు నెలల కాలంలో పెరిగిన సిజేరియన్ల డేటాను పట్టుకొని ఇక తెలంగాణలో నార్మల్ డెలివరీలే జరగడం లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఇదివరకు కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణలో పెరిగిన నార్మల్ డెలివరీల సంగతి ఏంటి మరి. ప్రతీదాన్ని ఇలా భూతద్దంలో పెట్టి చూసి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా? పట్టేసుకుందామా? దుమ్మెత్తిపోద్దామా? అన్న యావలో ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. అసలు.. మీలాంటి తెలంగాణ ద్రోహులను తెలంగాణ ప్రజలు ఆదరించడం తప్పు. కుల గజ్జి పట్టుకున్న ఈ పత్రికను, ఆర్కేను తెలంగాణ నుంచి తరిమి కొడితేనే తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది.

Top