You are here
Home > Latest News > ఇంకా ఈ బుడ్డరఖాన్ వస్తలేడేందే అనుకున్నాం!

ఇంకా ఈ బుడ్డరఖాన్ వస్తలేడేందే అనుకున్నాం!

Spread the love

(నూతన సచివాలయంపై రేవంత్ రెడ్డి పిల్)

ఇంకా బుడ్డరఖాన్ వస్తలేడేందే అనుకున్నాం!

  • రాజకీయ పిట్టలదొర రేవంతం చీప్ క్వాలిటీ చేష్టలు
  • ప్రజావ్యతిరేకత లేకున్నా రాజకీయం చేస్తున్న తీరు
  • జనం ఛీ కొడుతున్నా పట్టించుకోకుండా కేసులు

చీప్ చేష్టలు.. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. ఎప్పుడు ఎలాంటి చర్యలకు దిగుతున్నాడో కాంగ్రెస్ నేతలకే అర్థం కావడం లేదు. ఈ మధ్య పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నించీ ప్రయత్నించీ విఫలమైన ఆ బుడ్డరఖాన్.. ఉన్నట్టుండి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వంపై పడ్డాడు. సమున్నత లక్ష్యంతో సుహృద్భావ వాతావరణంలో.. రాష్ట్రానికి నూతన సచివాలయ భవనాన్ని నిర్మించాలన్న తలంపును అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి బిజీ అయ్యాడు.

తెలంగాణపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కుట్రలను.. నరనరానా జీర్ణించుకున్న ఈ దుర్మార్గుడు.. సచివాలయానికి నూతన భవన నిర్మాణాన్ని తప్పుబడుతున్నాడు. వ్యక్తిగతంగా.. కేసీఆర్, ఆయన కుటుంబం అంటే కోపం ఉండవచ్చుగాక. కానీ.. రాష్ట్రానికి నష్టం చేసేలా వ్యవహరించడం ఎంతవరకూ సబబు? రాష్ట్రానికి నూతన సచివాలయం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. న్యాయస్థానంలో రేవంత్ రెడ్డి పిల్ వేయడం ఎంతవరకూ కరెక్టు?

కేసీఆర్ ను ఓడించాలని రాష్ట్రమంతా తిరిగావే.. ఎన్నికల సమయంలో.. మరి.. ఫలితాల్లో ఏనాడైనా ఏమైనా సాధించావా రేవంతూ? థూ నీ బ చె.. అని ప్రజలు తిడుతున్నా పట్టించుకోకుండా ఇలా కేసులు వేస్తున్నావే.. నువ్వు మనిషివా.. లేకుంటే చంద్రబాబువా? ఈ మాట మేం కాదురా బాబూ అనేది.. సాక్షాత్తూ నిన్ను కోరి ఎంపీగా ఎన్నుకుని ఇపుడు బాధపడుతున్న మల్కాజిగిరి ప్రజలు.. స్వయానా ఈ బాధను వ్యక్తం చేస్తున్నారు.

వీడింతే.. ఇక మారడు అన్నంత నిశ్చయానికి వస్తున్న ప్రజలు మాత్రం.. ఓ మాట స్పష్టం చేస్తున్నారు. వాడేదో చెబితే.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. తోటి కాంగ్రెస్ నేతలెవరూ స్పందించడం లేదని.. అక్కడే రేవంతం ఓటమి ఖాయమైందని స్పష్టం చేస్తున్నారు. ఇంక సామాన్యులుగా.. రేవంత్ దుష్ట చర్యలను తాము మాత్రం సమర్థించేది లేదని తేల్చి చెబుతున్నారు.

Top