You are here
Home > Latest News > ఇది ఎన్నికల వ్యూహం కానే కాదు!

ఇది ఎన్నికల వ్యూహం కానే కాదు!

Spread the love

రైతు బంధు పథకం ఎన్నికల వ్యూహమని కొందరు అంటున్నారు. కానీ.. రైతులే ఈ అభిప్రాయాన్ని తిప్పికొడుతున్నారు. ఎన్నికల వ్యూహమే అయితే.. గత ఏడాదే ఈ పథకాన్ని ఎందుకు ప్రకటిస్తారు? ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉండగానే ఎందుకు రైతులకు మేలు చేస్తామని అంటారు? ఏం చేసినా.. ఎన్నికల కోణంలో చూడాల్సిందేనా? ఏం సహాయం చేసినా.. ఎన్నికల కోణంలో ఆలోచించాల్సిందేనా? ఇది ఎంత మాత్రం సరికాదు అని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు.

రైతుబంధు పథకంతో.. తమకు పెట్టుబడి కష్టాలు తీరాయని రైతులు ఆనందిస్తున్నారు. ఇన్నాళ్లుగా తమకు అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని చెప్పే ప్రభుత్వాలే తప్ప.. నిజాయితీతో చిత్తశుద్ధితో ఇంతగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని రైతులంటున్నారు. సాగును బాగు చేయడం అంటే ఏంటో.. దేశానికి చూపిస్తున్న ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ శ్రమను కొనియాడుతున్నారు.

అందుకే.. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల వ్యూహంగా కాకుండా.. రైతు సంక్షేమం దృష్టిలో తీసుకోవాలని కోరుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా.. ఈ పథకాన్ని అమలు చేయాలని.. మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చినట్టే ఉచిత కరెంటు ఇచ్చి.. పంటలకు పెట్టుబడి సహాయాన్ని కూడా అందించాలని అన్నదాతలు సూచిస్తున్నారు.

Top