You are here
Home > Inter National News > ఇది కశ్మీర్ కాదు.. తెలంగాణ.. ఇక్కడ కేసీఆరే బాస్!

ఇది కశ్మీర్ కాదు.. తెలంగాణ.. ఇక్కడ కేసీఆరే బాస్!

Spread the love

రామ్ మాధవ్ వస్తే ఏంటి.. ఏకంగా నరేంద్రమోడీనే దిగితే ఏంటి? బీజేపీ నేతలకు వచ్చేది.. పోయేది ఏమీ లేదు. ఎందుకంటే.. కొత్తగా వాళ్లకు అధికారం అంటూ ఏదీ లేదని జనాలే చెబుతున్నారు. పాతగా ఉన్న ఐదు సీట్లలో గెలిచినా.. ఓడినా పెద్ద విషయం కాదని కూడా అంటున్నారు. పైగా.. రామ్ మాధవ్.. రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ గా వస్తే.. చివరికి పరువు పోగొట్టుకునేది కూడా రామ్ మాధవే. దానికి చాలానే కారణాలు ఉన్నాయి.

కశ్మీర్ లో బీజేపీకి అధికారం తెచ్చిన రామ్ మాధవ్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ.. వాస్తవాలు పరిశీలిస్తే.. కశ్మీర్ లో ఓ సామాజిక వర్గ ప్రభావం ఎక్కు. మరో సామాజిక వర్గానికి అక్కడ కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న మాట కూడా వాస్తవం. కారణాలను, ఇతరత్రా చర్చలను పక్కనపెడితే.. ఇలాంటి సున్నితమైన వాతావరణంలో.. సెంటిమెంట్ ను క్యాష్ చేసుకున్న బీజేపీ.. అక్కడ ఒక ప్రాంతం వరకు మాత్రమే పట్టు సాధించగలిగింది.

మిగతా ప్రాంతంలో పీడీపీ సాధించిన విజయంతో వాళ్లు కూడా కలిసిపోవడంతోనే.. జమ్మూకశ్మీర్ లో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అంతే తప్ప.. అక్కడ బీజేపీ పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.. ఇందుకు రామ్ మాధవ్ కూడా పూర్తి స్థాయిలో కారణం కాదు. రామ్ మాధవ్ గొప్పతనాన్ని.. ఆయన కార్యదక్షతను విమర్శించడం అన్నది పాయింట్ కాదు కానీ.. ఇలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా.. ఆయన అంత.. ఈయన ఇంత.. వస్తే జరిగేది అంతంత.. అంటూ బీజేపీ నేతలు ఇంకా కలలు కంటూ కూర్చుంటే.. ఒరిగేదేం లేదు.

ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాల్సిన బీజేపీ నేతలు.. ముందు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన కేటాయింపుల్లో మరింత ప్రయోజనం కలిగేలా చూడాలి. లేకుంటే.. భవిష్యత్తులో వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారక తప్పదు. అప్పుడు రామ్ మాధవ్ కాదు.. ఇంకెవరు వచ్చినా.. బీజేపీకి జరిగిన నష్టాన్ని పూడ్చలేరు.

Top