You are here
Home > Latest News > ఇది కాంగ్రెస్ తీరుకు నిదర్శనం

ఇది కాంగ్రెస్ తీరుకు నిదర్శనం

Spread the love

ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ కాంగ్రెస్ చేజారిపోవడానికి కారణం కాంగ్రెస్. ఉద్రిక్తతలు సృష్టింపబడటానికి కారణం కాంగ్రెస్. కోదండరాంతో కలిసి విద్యార్థులను తప్పుదోవ పట్టించింది కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు నీతులు చెబుతూ పెద్దమనిషిలా వ్యవహరిద్దామని అనుకుంటోంది. ఈ వ్యవహారానికి మాజీమంత్రి, నిజాలు తెలిసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఓయూ నుంచి సైన్స్ కాంగ్రెస్ తరలిపోవడంపై ఆయన స్పందిస్తూ.. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని మాట్లాడుతున్నారు. దానికి ముందు.. ఆయన పార్టీ చేసిన ఆందోళనలను, అనవసర రాద్ధాంతాన్ని ఓ సారి దృష్టిలో పెట్టుకుంటే.. జీవన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడరు. విభజనకు ముందు విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించి పైశాచిక ఆనందాన్ని చాటుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు అదే విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తూ.. సరిగా చదువుకోకుండా.. పోటీ పరీక్షలకు హాజరు కాకుండా చేస్తున్నారు.

విద్యార్థులు ఏం పాపం చేశారో కానీ.. వారి పాలిట శాపంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ ముసుగులోనే నిందలను కేసీఆర్ పై వేసే ప్రయత్నం చేస్తోంది. ఇంత చేసినా.. ఇంకా ఓయూ విద్యార్థులు సహనంతో ఉన్నారంటే.. వారు నిజాలను అర్థం చేసుకున్నందుకు అభినందించాల్సిందే. విద్యార్థులను చూసైనా.. కాంగ్రెస్ నేతలు కాస్తయినా మారితే.. తెలంగాణ సమాజానికి వారు ఎంతో మంచి చేసినవాళ్లవుతారు.

Top