You are here
Home > Latest News > ఇదీ… “కోరా” అసలు సంగతి!

ఇదీ… “కోరా” అసలు సంగతి!

Spread the love

 

 

  • – కోదండరాంపై అవినీతి మరక
  • – అధికారంలోకి వస్తే చేయబోయే అక్రమాలకు సూచిక
  • – టికెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వైనం

కోదండరాం గురించి మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆయన చెప్పేది ఒకటి.. చేసేది మరోటి అని అనుకుంటూనే ఉన్నాం. అవినీతికి ఆయన కేరాఫ్ అన్న ఆరోపణలు కూడా విన్నాం. కానీ… ఇప్పుడు అదంతా నిజం అని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇన్నాళ్లూ ఆయన వెంటే ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా కోరా లీలలు బయటపెడుతున్నారు. పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలకు ఏ ఒక్క నేత కూడా బదులు చెప్పలేకపోతుండడం తెలంగాణ జన సమితి దారుణాలను చెప్పకనే చెబుతోంది. కపిలవాయి దిలీప్ కుమార్ లాంటి నేతలు టికెట్ల అమ్మకాల వ్యవహారాలను చూస్తున్నారన్న బలమైన ఆరోపణలు రావడం… ఆ పార్టీలో ఉన్న అంతర్గత పరిస్థితిని బయటపెడుతోంది. దిలీప్ కుమార్ కు తాను రెండు లక్షలు ఇచ్చానని… అంతకంటే ఎక్కువగా మరింత మంది ఇస్తూనే ఉన్నారని నాయకురాలు జ్యోత్స్న ఆరోపణలు చేయడం చూస్తుంటే… అసలు కోదండరాం లక్ష్యం ఏంటి అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది.

ఈ ఒక్క వ్యవహారం చాలు. కోదండరాంను అధికారంలోకి రాకుండా చేసేందుకు అని కొందరు అంటుంటే… అధికారం ముచ్చట ఎందుకు? కోదండరాం ఎక్కడ పోటీ చేసినా సరే. భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుందాం… ప్రజా ఆకాంక్షను ప్రపంచానికి చెబుదాం అంటూ మరికొందరు దృఢ నిశ్చయానికి వస్తున్నారు.

ప్రజలే కేంద్రంగా నడుస్తున్న ఈ ప్రచారం చూస్తుంటే… రాబోయే ఎన్నికల్లో కోరా పార్టీ ఎదుర్కోబోయే దారుణ పరాజయం ముందే తెలిసిపోతోంది. టీఆర్ఎస్ కు దక్కనున్న ఘన విజయం కళ్ల ముందు కనబడుతోంది.

Top