You are here
Home > Latest News > ఇదీ.. వీళ్ల అసలు రంగు!

ఇదీ.. వీళ్ల అసలు రంగు!

Spread the love

కొందరు ప్రభుత్వ వ్యతిరేకంగాళ్లు ఉంటారు. వాళ్లు.. ఏం చేసినా.. ఏం పని చేసినా.. అంతా ప్రభుత్వ వ్యతిరేకంగానే ఉంటుంది. ఇదిగో.. వీళ్లు కూడా.. ఇదే పని చేస్తున్నారు. కొన్నాళ్లుగా.. ఏం పని చేసినా.. ఆఖరికి దగ్గినా.. తుమ్మినా కూడా.. ఆ పని ఎవరు చేసినా కూడా.. అంతా ప్రభుత్వ తప్పిదమే అన్నట్టుగా.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తమ మీడియా సంస్థలో వెటకారపూరితమైన కార్యక్రమాలతో జుగుప్స కలిగిస్తున్నారు.

వీళ్లు ఉద్దేశం ఏంటో.. వీళ్లు చేసే పని ఏంటో కొందరు టీవీ చూడని వాళ్లకి ఇంకా అర్థం కావడం లేకపోయినా.. ఈ వీడియో చూస్తే.. సర్కార్ పై ఎంత వ్యతిరేకత ఉందన్నదీ.. అర్థమైపోతోంది. ఎందుకంటే.. ఇది జనం స్వయంగా వచ్చి చెప్పిన అభిప్రాయం కాదు. ఈ వీడియో లో ఉన్న పెద్దమ్మ.. కారుకు ఓటు వేస్తానన్నా.. చేతికి ఓటు వేస్తానన్నా.. అది వేరే విషయం. కచ్చితంగా అది.. ఈ మీడియా సంస్థ వాళ్లు స్క్రిప్టు రాసి మరీ చెప్పించిన విషయమే.

ఎందుకంటే.. ప్రజల్లోకి వెళ్లి అభిప్రాయాలు తీసుకోవడం కాకుండా.. తమకు తోచిన తప్పుడు స్క్రిప్టులు రాసుకుని.. వాటికి వీడియోలు జత చేసి.. బ్యాక్ గ్రౌండ్ లో వెటకారమైన సౌండ్లు పెట్టి.. సర్కార్ పై అదో రకమైన వ్యతిరేకత కలిగించేలా అరగంట ప్రోగ్రాములు ప్లాన్ చేసినంత మాత్రాన.. వాళ్ల ద్వంద్వార్థాలు ప్రజలకు అర్థం కాకుండా పోవు.

పెన్షన్లు, చీరల పంపిణీ మీద.. అనవసరమైన, అసందర్భమైన కథనాలు ప్రసారం చేసి.. జనాల్లో చులకన కావడం తప్ప వీళ్లు సాధించేది ఏదీ లేదు. పైగా.. ప్రజల నుంచి నేరుగా అభిప్రాయం తీసుకోలేదన్న అపవాదు కూడా మూటగట్టుకున్నవాళ్లు అవుతారు. ఓ సారి సింగరేణి ఎన్నికల ఫలితాలు గమనిస్తే.. ప్రజల్లో.. అన్ని వర్గాల్లో కేసీఆర్ పై, ఆయన నాయకత్వంపై ఉన్న అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుంది.

ఇవేవీ పట్టని ఈ మూర్ఖులు.. ఇలాంటి ప్రచారాలతో సాధించేదీదీ లేదు.

Top