You are here
Home > Latest News > ఇదే మీకూ.. కేసీఆర్ కూ ఉన్న తేడా

ఇదే మీకూ.. కేసీఆర్ కూ ఉన్న తేడా

Spread the love

ఇదే మీకూ.. కేసీఆర్ కూ ఉన్న తేడా

  • కాళేశ్వరంపై మరోసారి ఆర్కే మార్క్ కుట్రలు
  • అడ్డగోలు రాతలతో జనాన్ని అయోమయం చేసే యత్నం
  • ప్రాజెక్టు అడ్డుకోవడమే ధ్యేయంగా పుకార్ల ప్రచారం

ఆంధ్రజ్యోతి.. చంద్రజ్యోతి అని నిరూపించుకుంటోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణపై చేసిన కుట్రలు.. ప్రాజెక్టులు అడ్డుకోవాలని చూపిన తీరును.. ఇప్పుడు ఆ పత్రిక తన రాతలతో కొనసాగిస్తూ.. విషం కక్కే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కానీ.. తమ దుష్ట చూపులకూ.. కేసీఆర్ దూరదృష్టికీ ఉన్న తేడాను మాత్రం ఆ పత్రిక తెలుసుకోలేకపోతోంది. మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం పైపులైను వ్యవస్థకే మొగ్గు చూపుతోందని.. సొరంగ మార్గమైతేనే మంచిదని నిపుణులు చెబుతున్నారని ఓ కథనాన్ని వండి వార్చింది.

కాసేపు ఈ వాదన నిజమే అనుకుందాం. కానీ.. ఆ సో కాల్డ్ నిపుణులు చెప్పినట్టే.. సొరంగమే నిర్మిస్తే.. తర్వాత ఏమైనా మరమ్మతులు వస్తే ఎవరు దిక్కవుతారు? మళ్లీ వేలకు వేల కోట్లు ఖర్చు చేయాల్సిందేనా? కాలం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. 3 దశాబ్దాల మేర అవసరాలు పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసి.. తదనంతరం మరోసారి అవసరాలకు అనుగుణంగా సమీక్ష చేసుకుంటే మంచిది కాదా?

ఇక.. మల్లన్న సాగర్ లో కాల్వల పూర్తికి మరో మూడేళ్లు పడుతుందని.. ఆలోపే టన్నెల్ ను సులభంగా నిర్మాణం పూర్తి చేయొచ్చని నిపుణుల వాదనను ఉటంకిస్తూ కథనంలో హైలైట్ చేసింది. అంటే.. ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలియకుండానే.. జరుగుతున్నాయా? భవిష్యత్తుకు ఏది మంచిదో ఏది కాదో.. తెలంగాణ సాధించిన కేసీఆర్ కు తెలియకుండా ఉంటుందా? అని సామాన్య జనం కూడా ఈ రాతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం రీ డిజైన్ చేసినప్పుడూ కొందరు ఇలాగే కుట్రలు చేసిన విషయం ప్రస్తావిస్తున్నారు.

ఏది ఏమైనా.. ఎవరు ఏమన్నా.. జనానికి ఏది మంచిదో అదే కేసీఆర్ చేస్తారు.. చేసి తీరుతారు. కాళేశ్వరం విషయంలోనూ అంతే.

Top