You are here
Home > Uncategorized > ఇన్నాళ్లూ ఎందుకు చేయలేకపోయారో!!

ఇన్నాళ్లూ ఎందుకు చేయలేకపోయారో!!

Spread the love

గెలుపు కోసం చేతకాని హామీలు ఇస్తున్న కాంగ్రెస్

టీఆర్ఎస్ ఒకటిస్తే నేను రెండిస్తా అన్నట్టు వైఖరి

కాంగ్రెస్ ఓటమికి కారణం కాబోతున్న హామీలు

కాంగ్రెస్ పార్టీ.. గెలుపు కోసం ఎందాకైనా దిగజారేలా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ పాలన చేశారేరాష్ట్ర అరవై ఏళ్ల అస్తిత్వ పోరాటాన్ని అడుగడుగునా అణగదొక్కారే. టీడీపీతో కలిసి సర్వస్వం దోచుకున్నారే. అప్పుడు ఇవ్వలేకపోయిన హామీలను ఇప్పుడెందుకు ఇస్తున్నారు మరిఅని జనం నిలదీస్తుంటే పార్టీ నేతలు జవాబు చెప్పలేకపోతున్నారు. ఏడాదికి ఆరు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఎన్నికల హామీలో ప్రకటించారు కదా. బానే ఉంది.

కానీ… 2004 నుంచి పదేళ్లు అధికారంలో ఉన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల డిమాండ్ అయిన తెలంగాణ ఏర్పాటును పదేళ్లు పెండింగ్ లో పెట్టారు. టీఆర్ఎస్ తో పొత్తులు కుదుర్చుకుని రాజకీయంగా లాభ పడ్డారు. తర్వాత తెడ్డు చూపిస్తూ ప్రజలను అన్యాయం చేశారు. తెలంగాణ ప్రజలకు రూపాయి కూడా ఇచ్చేది లేదంటూ స్వయానా కాంగ్రెస్ కు చెందిన నేతలే వ్యాఖ్యానించారు. అభివృద్ధిని అడ్డగోలుగా అడ్డుకున్నారు.

అలాంటి నేతలు వచ్చి.. ఇప్పుడు ఇంటికి ఐదు లక్షలిస్తాం, ఏడాదికి ఆరు సిలిండర్లు ఇస్తాం.. అంటూ కాయ్ రాజా కాయ్ ఆట ఆడుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ నమ్మేందుకు జనం ఏమంత పిచ్చోళ్లు కాదు. 2014 వరకూ పట్టింపులేని పాలన అంటే చూసిన ప్రజలు నాలుగేళ్లుగా సంక్షేమం అంటే ఏంటో అర్థం చేసుకున్నారు. అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుత పాలన ఎలా జరుగుతుందో అన్న విషయాన్ని కేసీఆర్ నుంచి అర్థం చేసుకున్నారు. అలాంటి పాలన కాంగ్రెస్ కు సాధ్యం కాదని అవగతం చేసుకున్నారు.

అందుకేచేతకాని హామీల కాంగ్రెస్ ను గద్దెనెక్కకుండా చేసేందుకు జనాలు ఒక్కటవుతున్నారు.

Top