You are here
Home > Latest News > ఇప్పుడు కాదు.. దశాబ్దాలుగా యాదగిరిగుట్టలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కిషన్ రెడ్డి..

ఇప్పుడు కాదు.. దశాబ్దాలుగా యాదగిరిగుట్టలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కిషన్ రెడ్డి..

Spread the love

 

  • ఇన్నిరోజులు మీకు గుర్తుకురాలేదా?
  • ఎప్పటినుంచో యాదగిరిగుట్ట వ్యభిచారానికి అడ్డాగా మారింది..
  • అప్పుడెందుకు మీరు నోరు మెదపలేదు..

వీళ్లకు అన్నీ ఒక రాత్రిలోనే జరిగిపోవాలి. టైమ్ మిషన్ లో గిర్రున తిరిగి క్షణంలో ఓ వెయ్యి ఏండ్లు ముందుకు పోవాలి వీళ్లకు. దశాబ్దాలుగా తెలంగాణలో అవినీతి, అక్రమాలు పాతుకుపోయాయి. వాటన్నింటినీ కూకటివేళ్లతో కూల్చిపారేయాలి. కాని.. దశాబ్దాల పాటు నాటుకుపోయిన అవినీతి ఒక్కరోజులో పోతుందా? అలాగే ఏదైనా. యాదగిరిగగుట్టలో అసాంఘిక కార్యక్రమాలు వెలుగులోకి రావడం సిగ్గుచేటు అంటూ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నాడు. కరెక్టే కిషన్ రెడ్డి.. సిగ్గు చేటే. కాని.. ఇది ఇవాళ ప్రారంభమయిందా? నిన్న ప్రారంభమయిందా? లేక మొన్న ప్రారంభమయిందా? దశాబ్దాలుగా యాదగిరిగుట్టలో వ్యభిచారం జరుగుతున్నదన్న విషయం గత ప్రభుత్వాలకు తెలియదా? మరి.. గత ప్రభుత్వాలు ఎందుకు అటువంటి స్థావరాలపై ఉక్కుపాదం మోపలేదు.

యాదగిరిగుట్టలో ఉన్న ఎవరినడిగినా చెబుతారు. ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతున్నదో. తెలంగాణను ఎక్కువగా పాలించిన కాంగ్రెస్ కాని, తొమ్మిదేండ్లు పాలించిన చంద్రబాబు కాని వ్యభిచార గృహాలపై ఎందుకు దాడులు జరుపలేదు. పోనీ.. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నువ్వు కాని.. బీజేపీ పార్టీ కాని ఇన్నేండ్లు ఎందుకు దానిపై మాట్లాడలేదు. ఎందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలను నిలదీయలేదు. ఇప్పుడే గుర్తుకు వచ్చాయా నీకు ఇవన్నీ.

తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్ వ్యవస్థ. తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో గాని, వేరే ఎటువంటి ఘటనల్లోనూ పోలీసింగ్ వ్యవస్థ రాజీ పడదు. గత ప్రభుత్వాల్లా కాకుండా పోలీసులు యాదగిరిగుట్టలో దాడులు చేసి ఎంతో మంది చిన్నారులను రక్షించారు. గత ప్రభుత్వాల్లా చూస్తూ ఊరుకోలేదు తెలంగాణ ప్రభుత్వం. వ్యభిచారం గుట్టు రట్టు చేసింది. దశాబ్దాలుగా సాగుతున్న వ్యభిచారం దందాను తెలంగాణ పోలీసు యంత్రాంగం సీరియస్ గా తీసుకున్నది. అందుకే దాని గుట్టును రట్టు చేసి ఎంతో మంది పసిమొగ్గల జీవితాలను కాపాడింది. కాని.. నువ్వేమో.. తెలంగాణ ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు.. తెలంగాణ ప్రభుత్వం వల్లే ఇదంతా జరిగినట్లు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నడు. నీకు ఏమైనా తెలంగాణ ప్రభుత్వం మీద బురద జల్లడమే కావాల్సింది. అంతే.. ఇంకేం అవసరం లేదు. ఇదంతా కేవలం ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసం మీరు వేసే ఎత్తుగడలని యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు. అందుకే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగగా ఉన్నారు.

Top