You are here
Home > Latest News > ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కేసీఆర్ సఖ్యతగా ఉంటే ప్రతిపక్షాలకేం నొప్పి…

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కేసీఆర్ సఖ్యతగా ఉంటే ప్రతిపక్షాలకేం నొప్పి…

Spread the love
  • ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కేసీఆర్ సఖ్యతగా ఉంటే ప్రతిపక్షాలకేం నొప్పి…
  • ఏపీ అభివృద్ధికి సాయం చేస్తామని కేసీఆర్ పేర్కొనడంపై ప్రతిపక్షాల అవాకులు చెవాకులు…
  • సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రీతిలో చెలరేగుతున్నారని విమర్శలు…
  • ఇకనైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని, లేకపోతే కాలగర్భంలో కలిసి పోవడం ఖాయం….
పొరుగు రాష్ట్రాల అభివృద్ధి పై దృష్టి పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్కొనడంపై ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో విపరీతమైన వక్రభాష్యాలు చెబుతున్నాయి. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమను రతనాల సీమగా కేసీఆర్ చెస్తానని పేర్కొనడంపై విమర్శలు చేయడం సరి కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దయార్ద్రహృదయుడైన కేసీఆర్ ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారు.దీనిని కూడా రాజకీయాలకు వాడి తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు భాస్తున్నారు.
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ ప్రభుత్వం సఖ్యతగా ఉండటంతో కాలేశ్వరం ప్రాజెక్టుకు ఆ రాష్ట్రం ఎలాంటి అడ్డు చెప్పలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర ఒడిసా రాష్ట్రాలతో కే తెలంగాణ ప్రభుత్వం కలిసిమెలిసి ఉంటుందని ఈ క్రమంలోనే రాష్ట్రానికి కావలసిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకుంటుంది అని పేర్కొంటున్నారు.
ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఇరుగు పొరుగు ప్రాంతాలు కూడా ఎంతో శాంతియుతంగా ఉండాలని ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కెసిఆర్ ఇతర రాష్ట్రాలతో సఖ్యత కోసం పాటు పడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వాస్తవాలను గ్రహించలేని ప్రతిపక్షాలు అనవసరంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు.
ఇప్పటికే నిజమైన స్టేట్ మన్గా  కేసీఆర్ తన మార్కును చూపెట్టారని రాబోయే రోజుల్లో తెలంగాణ బాగు కోసం అనేక ప్రాజెక్టులకు సహకారాన్ని తీసుకొని వస్తారని పేర్కొంటున్నారు.ఇకనైనా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తో కలిసి ప్రతిపక్షాలు నడవాలని లేకపోతే ప్రజలే వాళ్లకు బుద్ధి చెబుతారని సందర్భంగా విశ్లేషకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Top