You are here
Home > Latest News > ఈ నీతి పలుకులు.. కాంగ్రెస్ వాళ్లకు చెప్పు

ఈ నీతి పలుకులు.. కాంగ్రెస్ వాళ్లకు చెప్పు

Spread the love

ఈ దుర్మార్గులు, చరిత్ర హీనుల మాటలకు బదులు చెప్పేముందు.. ఓ సారి మనం చరిత్రను గుర్తు చేసుకోవాలి. అప్పుడెప్పుడో.. వైఎస్ రాజశేఖరరెడ్డి అనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి.. తెలంగాణతో కూడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు.. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ.. తెలంగాణ పెట్టుబడులతో.. సీమాంధ్రను అభివృద్ధి పరుస్తూ.. వరుసగా ప్రాజెక్టులు కట్టినపుడు.. రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించారు.

అప్పుడు కూడా.. రైతుల్లో కొందరు.. భూమిని ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ.. ప్రాజెక్టులు, చట్టాల పేరు చెప్పి.. పరిహారం సరిగా అందించకున్నా.. భూములు మాత్రం లాక్కుని.. ప్రాజెక్టుల పనులు ప్రారంభించారు. వాటికి శిలాఫలకాలు వేసి.. వాటి సంగతి మరిచిపోయారు. అక్కడి నుంచి.. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రుల మార్పిడి జాతర మొదలైంది. రోశయ్య చేతగాని తనానికి.. కిరణ్ కుమార్ రెడ్డి మూర్ఖత్వం తోడు కావడంతో.. ప్రజలు సర్వస్వం కోల్పోయారు. పాలన గాడి తప్పింది. ప్రాజెక్టుల సంగతి అటటెక్కింది.

ఆ తర్వాత కానీ.. ప్రజలకు రోజులు మారలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే.. తమ రాతలు మారుతున్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మాటలు చెప్పడం కాదు.. నిధులు కేటాయిస్తూ.. ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని జనం గుర్తిస్తున్నారు. పరిహారం కూడా.. పక్కాగా అందించాకే.. పనులు పరుగులు పెట్టిస్తున్న సంగతిని కూడా గమనిస్తున్నారు. ఇదంతా చూసిన కాంగ్రెస్ పార్టీ దొంగలు.. కోదండరాం అనే మనిషిని తమ ఏజెంటుగా మార్చుకుని.. జనం మీద కుట్రలు చేస్తున్నారు.

ఇప్పుడు.. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు.. చాలా మంది భూములు ఇచ్చేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చినా.. కేవలం పదుల సంఖ్యలో రైతులను రెచ్చగొట్టి.. ఇలా దీక్షలు చేయిస్తూ.. వారి సంక్షేమానికి అడ్డుకట్ట వేస్తూ.. విషం చిమ్ముతున్నారు కాబట్టి. మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేముల ఘాట్ లో కొందరి ఆందోళనకు మద్దతుఇస్తూ.. గొప్ప పని చేస్తున్న పోజులు కొడుతున్న కోదండరాం, మర్రి శశిధర్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం.. ఆ ముసుగులో తాము చేస్తున్న అన్యాయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు.

రైతులకు భూమే ప్రాణం, సర్వస్వం అని చెబుతూ.. ఆరైతుల కోసమే ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతున్న వాస్తవాన్ని వివరించలేకపోతున్నారు. ప్రాజెక్టుల పనులు ప్రారంభించి వదిలేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేలా.. కేసీఆర్ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుంటే.. తట్టుకోలేక అవాస్తవాలు చెబుతూ చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు.

Top