You are here
Home > Latest News > ఉదయ సముద్రం పైన నీకు అంత ఆత్రం వద్దు

ఉదయ సముద్రం పైన నీకు అంత ఆత్రం వద్దు

Spread the love

 

  • ఉదయ సముద్రం ఎత్తిపోతల పై కోమటి రెడ్డి హల్ చల్…
  • ఎంపీగా విఫలమవడం తోటి ప్రజల దృష్టిని మరల్చేందుకే పాదయాత్ర…
  • సీఎం కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలితే మర్యాద దక్కదు…
  • మీ  ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తున్న ప్రజలు…

ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి డ్రామాలకు దిగుతున్నాడు. గత 12 ఏళ్లుగా ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదని ఆరోపిస్తున్నా తను అతని ప్రభుత్వం ఉండగా ఎందుకు దీనిని పూర్తి చేయలేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ హయాంలోని గత ఐదేళ్ల పాలనా కాలాన్ని తీసేస్తే అంతకుముందు 7ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి కూడా మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాను ఏమాత్రం పట్టించుకోని కోమటిరెడ్డి ఇప్పుడు మాత్రం తన రాజకీయ లబ్ధి కోసం పాదయాత్రలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టే రీతిలో ప్రవర్తిస్తున్నాడు. భువనగిరి నుంచి హైదరాబాద్ వరకు 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర కు శ్రీకారం చుట్టాడు. అయితే పాదయాత్రకు 5 వేల మందితో పోటీ చేస్తానని ప్రగల్భాలు పలకడం పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సమస్యల పట్ల  దృష్టి ఉన్నట్లయితే ఇన్ని వేల మందితో ఈ పాదయాత్ర చేపట్టారని కేవలం ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రం మొత్తాన్ని స్వయంగా సమీక్షిస్తున్నారు అని ఆయన ఏ ప్రాంతం మీద కూడా వివక్ష చూపెట్టడం లేదు అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తన మీద ద్వేషం తోటే ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపణలు ఆయన సిగ్గులేని తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఏమాత్రం మేలు చేయడంలో విఫలమై ఓడిపోయిన కోమటిరెడ్డి ఎంపీగా ను పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి పాదయాత్రలకు నడం బిగించాలని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా జనం పేర్కొన్నారు.

 

 

 

Top