You are here
Home > Latest News > ఉమా మాధవరెడ్డి గారూ! కేసీఆర్ ను, దూషిస్తే ఏమొస్తుంది?కృతం కర్మ శుభాశుభం.

ఉమా మాధవరెడ్డి గారూ! కేసీఆర్ ను, దూషిస్తే ఏమొస్తుంది?కృతం కర్మ శుభాశుభం.

Spread the love

ఉమా మాధవ రెడ్డి గారూ,ఇప్పుడు మీ వంతు వచ్చినట్టు కనిపిస్తున్నది కేసీఆర్ ను తిట్టడానికి.ఏమిటీ? తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయి లాగా కనిపిస్తున్నదా?కరెక్ట్ మీకు అలాగే కనిపిస్తుంది.అలా కనిపించకుంటేనే ఆశ్చర్యపోవాలి.అవును కేసీఆర్ కు తెలంగాణా అన్నా తెలంగాణ ప్రజలన్నా,తెలంగాణ ప్రాంతం అన్నా పిచ్చి అభిమానం,అందుకే తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను,వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని దోపిడీని చూసి చలించిపోయి,ఒక మాహోద్యమాన్నే నడిపాడు,తెలంగాణను వలస పాలన నుండి విముక్తి కలిగించాడు.ఇది మీలాంటి వారికి ఏమాత్రం నచ్చని పని.అందులో ప్రత్యేకంగా మీకు కేసీఆర్ అంటే ఒళ్ళు మంట,దానికీ కారణం లేకపోలేదు.

కేసీఆర్ కు తెలంగాణ అంటే ఎంత అభిమానమో,తెలంగాణ ద్రోహులన్నా,తెలంగాణ సమాజానికి శత్రువులన్నా పట్టరానంత కోపం.అలాంటి వాళ్ళను నిర్దయగా శిక్షించాడు,అందులో నయీం అనే కరుడుగట్టిన నేరస్థుడు కూడా ఉన్నాడు.ఇదిగో ఈ పనే మీతో సహా మీ పార్టీ వాళ్లకు ఎవరికీ నచ్చలేదు.నయీం ను మీరే పెంచిపోషించారని,ఆశ్రయం కలిగించారని,మీ భర్త ను హత్య చేసిన వాళ్ళను నయీం సహాయంతో మట్టు బెట్టించారు అని,మీ ఫోన్ నుండి నేయీం కొన్ని వేల కాల్స్ పోయినట్టు అప్పుడు మీడియా అంతా కొడైకూసింది,ఇందులో నిజమెంతో తెలియాలి అంటే విచారణ జరిగి కోర్టు తీర్పు వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

అలాంటి మీరు కేసీఆర్ ను ద్వేషించడం లో తప్పేమీ లేదు.అంతేనా అంటే తెలంగాణాలో మీ పార్టీని నామరూపాలు లేకుండా చేసాడు.చంద్రబాబు లాంటి వాడిని కూడా తెలంగాణ పోలిమేరలాదాకా తరిమేసాడు.వోటుకు నోటు కేసు తో,కేసీఆర్ ను నిరంతరం దూషించే రేవంత్ ను నేల నాకించేసాడు.అదేమిటో గాని,తెలంగాణ తెలుగుదేశం నేతలేమో కేసీఆర్ ను నిత్యం దూషిస్తూ ఉంటారు.అదే ఆంధ్రా కు చెందిన తెలుగుదేశం నాయకులేమో చాలా అభిమానాన్ని చూయిస్తారు.శుభ కార్యాలకు ఆహ్వానిస్తారు.చంద్రబాబు నాయుడైతే ఏకంగా అమరావతి శంఖుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానించడమే కాక,శిలా ఫలకం పై పేరు కూడా చెక్కించాడు.కేసీఆర్ తన మొక్కులు తీర్చుకోవడానికి తిరుమల వెళితే,అక్కడి నాయకులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.టీఆరెస్ ను ఆంధ్రా లో కూడా స్థాపించమని వినతులు కూడా వచ్చాయి.పెద్ద,పెద్ద స్వాగత తోరణాలు,ఫ్లేగ్జీలు,పోస్టర్లు,బైక్ ర్యాలీలు,జిందాబాద్ లు.ఈ తేడా ఎందుకో నాకిప్పటికీ అర్థం కావడం లేదు.మీరు కరెక్టా?వాళ్ళు కరెక్టా?మీరు ఏ కేసీఆర్ నైతే దూషిస్తున్నారో,అక్కడ మీ పార్టీ వాళ్ళే ఎక్కడలేని అభిమానం చూయిస్తున్నారు.దీనిపై మీ కామెంట్?

Top