You are here
Home > Latest News > ఎందుకు ఈనాడు.. ఇలాంటి పుకార్లను ఎందుకు లేపుతున్నావు?

ఎందుకు ఈనాడు.. ఇలాంటి పుకార్లను ఎందుకు లేపుతున్నావు?

Spread the love
  • ఎందుకు ఈనాడు.. ఇలాంటి పుకార్లను ఎందుకు లేపుతున్నావు?
  • అదృశ్యమవుతున్నారంటూ పనికిమాలిన కథనాలను ఎందుకు వడ్డిస్తున్నావు
  • ఇటువంటి పుకార్లను లేపడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి?
  • ఎవ్వరూ తప్పిపోవడం లేదు.. వాళ్లకు వాళ్లుగా వెళ్లిపోయిన పరిస్థితులు అవి
  • ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా… పోలీసుల మీద నింద మోపడం దేనికి సంకేతం
  • ఇవేనా మీ జర్నలిజం విలువలు

తెలుగు భాషలో మా పత్రికే టాప్. భారత్ లోని టాప్ 10 పత్రికల్లో మా పత్రిక కూడా ఉంది. మా పత్రిక తోపు.. తురుము.. తెలుగు రాష్ట్రాల్లో మమ్మల్ని మించిన వాడు లేడు.. అంటూ గప్పాలు కొట్టుకునే ఈనాడు పత్రికకు కనీసం జర్నలిజం విలువలు కూడా తెలియవని ఈ కథనం ద్వారా తెలిసిపోతోంది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది ఈనాడు పరిస్థితి. ఛీ.. ఛీ.. ఇదేనా మీ పత్రిక విలువలు.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మహిళలు, పిల్లలు, పెద్దలు తప్పిపోతున్నారంటూ, అపహరణకు గురవుతున్నారంటూ అసత్యపు ప్రచారాలు వ్యాపిస్తున్నాయి. అదంతా తప్పుడు ప్రచారం. కావాలని ఎవరో సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లను లేపారు. అయితే.. సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు రావడం అనేది కామన్. నిజానికి.. ఆ మిస్సింగ్ కేసుల్లో జరిగిన అసలు నిజం ఏంటేంటే… కుటుంబం, ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో ఫెయిల్ అవడం వల్ల.. ఇతర కారణాల వల్ల వాళ్లే ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వాళ్లకు వాళ్లుగా ఇంటి నుంచి వెళ్లిపోతే.. దాన్ని వేరే విధంగా ఊహించుకొని అమ్మాయిలను, యువతులను ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని.. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని ఈనాడు కథనాన్ని వండి వార్చింది.

సోషల్ మీడియా, ఈనాడు పత్రిక ఒకటేనా? సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఎవ్వరూ నమ్మరు. మరి.. ఈనాడులో వచ్చిన కథనాలను కూడా ఎవ్వరూ నమ్మొద్దా ఈనాడు.. చెప్పు.

రాష్ట్ర డీజీపీనే ఇటువంటి తప్పుడు కథనాలపై స్పందించారు. ఇటువంటి పుకార్లను లేపొద్దని.. తప్పిపోయిన కేసుల్లో 85 కేసులను ట్రేస్ చేశామని.. అవన్నీ.. కావాలని ఇంటి నుంచి వెళ్లిపోయిన బాపతు కేసులని ఆయన చెప్పారు. మిగితా కేసులను కూడా ఛేదిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటువంటి పుకార్లను లేపొద్దని మీడియాకు కూడా ఆయన తెలిపారు.

 

ఒక బాధ్యతాయుతమైన పత్రిక అయి ఉండి తెలంగాణలో అలజడులు లేపాలని ప్రయత్నించడం ఎంత వరకు కరెక్ట్. తొమ్మిది రోజుల్లో 545 మంది తప్పిపోయారంటూ తాటికాయంత అక్షరాలతో కథనాలను వడ్డించి ఏం సాధిస్తారు. ఇటువంటి పనికిమాలిన కథనాలను వడ్డించడం ఎంత నేరమో.. నిన్న డీజీపీ కూడా తెలిపారు. దాని ప్రకారం ఈనాడుపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందే. అలా అయితేనే ఇంకోసారి ఇటువంటి తప్పుడు కథనాలు రాయడాన్ని ఆపుతుంది. ఈ పచ్చ పత్రిక కావాలనే తెలంగాణలో లేనిపోని అలజడులు సృష్టించాలని ఇటువంటి కథనాలను వండి వార్చుతోంది. తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్న ఈ పచ్చ పత్రికను తెలంగాణ ప్రజలు బహిష్కరించడమే దానికి పరిష్కారం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Top