You are here
Home > Latest News > ఎప్పటిలాగే రైతు సమితులను కూడా వ్యతిరేకించిన కోదండరాం.

ఎప్పటిలాగే రైతు సమితులను కూడా వ్యతిరేకించిన కోదండరాం.

Spread the love

కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను కోదండరాం గుడ్డిగా వ్యతిరేకించడం,విమర్శించడం,కొత్త విషయమేమీ కాదు.ఆయన ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నవిషయం ఇప్పుడు అందరికీ స్పష్టం అయ్యింది.అది రాజకీయ ప్రేరేపిత విమర్శ కాబట్టి  పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు,ఏ ప్రభుత్వం అయినా తెలిసి,తెలిసి,ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోదు.చాలా ఆలోచించి,సాధ్యమైనంత వ్యతిరేకత రాకుండా తీసుకోవాల్సిన చర్యలు అన్నీ తీసుకుంటుంది.కోదండరాం విమర్శలు ఎలా ఉంటాయి అంటే,ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే అది ప్రజా వ్యతిరేక నిర్ణయం,ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి,లేదంటే మేము మా కార్యాచరణ త్వరలో వేల్లడిస్తాము ఇవి ఆయన రుటీన్ డైలాగులు.ఏ ప్రభుత్వం అయినా నూటికి నూరు శాతం మందికి న్యాయం చేయలేదు,కొంతమందికి కొంత అసౌకర్యం తప్పదు.మెజారిటీ ఈజ్ ద లా. రాజ్యాంగ్యాన్ని ఇప్పటివరకు దాదాపు నూరుసార్లు సవరించారన్న విషయం మరిచిపోవద్దు..కోదండరాం విమర్శ లో  ఖండన మాత్రమే ఉంటుంది,నిర్మాణాత్మకమైన సూచనలు,సవరణలు లాంటివి కనిపించవు.ఇది బాగాలేదు అంటాడు, ఓకే,ఎందుకు బాగాలేదు?,కారణాలు ఏమిటి?,ఇది బాగాలేదు అంటే ,ఏది బాగుంటుంది?ఎలా చేస్తే బాగుంటుంది? లాంటివి మచ్చుకైనా కనిపించవు.

కోదండరాం కు ఈగో చాలా ఉన్నది,తాను మాత్రమే ప్రశ్నించాలి,తననెవరూ ప్రశ్నించకూడదు,కేసీఆర్ ను పట్టుకుని దొర,నియంత,ఫ్యూడలిస్ట్ అని చాలా అలవోకగా అనేస్తాడు.మళ్ళీ వెంటనే ప్రభుత్వం తన భావప్రకటనా స్వేచ్చను కాలరాస్తున్నది,అంటాడు.కాని తన ఒకప్పటి సహచరులు,పిట్టల రవీందర్,ప్రహ్లాద్,లాంటివారు సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక,చెప్పడం ఇష్టం లేక,వాళ్ళను, తనది కాని,దాని ఏర్పాటులో తన ప్రమేయం ఏమాత్రం లేని టీ.జాక్ నుండి తరిమేసాడు.కేసీఆర్ కు ఆపాదించిన లక్షణాలు ఎవరిలో ఉన్నాయో ఈ ఉదంతం ద్వారానే అర్థం అవుతున్నది.సామాజిక న్యాయం గురించి చాలా మాట్లాడతాడు,కోదండరాం ,తన పేరు చివర తోకను కట్ చేసుకున్నాను,అని గర్వంగా చెబుతాడు,కాని మొన్నటికి మొన్న టీ.పీ.సి.సి.ప్రెసిడెంట్ మా కులం శాతం ఇంత,మాకన్నా తక్కువ శాతం ఉన్న కులం వాళ్ళు రాజ్యాధికారం ఎలా చెలాయిస్తారు,అని చాలా మూర్ఖంగా మాట్లాడాడు,దానిని కోదండరాం మాటమాత్రమైనా ఖండించలేదు.పేరులో కాదు ,మార్పు ఆలోచనల్లో రావాలి.

సాధారణంగా ప్రభుత్వాలు ప్రతీ వ్యవస్థ,ప్రతీ రంగం తన ఆధీనం లో ఉండాలి అని  అనుకుంటాయి,ఒక్క మాటలో చెప్పాలంటే తన చెప్పుచేతల్లో ఉండాలని అనుకుంటాయి .కాని ప్రజాస్వామ్యంలో అది అంత సులువు కాదు.మన దేశంలో మన రాష్ట్రంలో లెక్కలేనన్ని సంఘాలు ఉన్నాయి,ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక,విద్యార్థీ,చివరికి కుల సంఘాలు కూడా ఉన్నాయి.వాళ్ళలో ఎవరికీ ఏమి జరిగినా సమ్మెలు,ధర్నాలు చేయడానికి వాళ్ళ సంఘ నాయకులు సిద్ధంగా ఉంటారు.వాళ్ళ డిమాండ్లు సత్వరంగా తీర్చబడతాయి.సంఘాలకు ప్రభుత్వాలు భయపడతాయి.దురదృష్టవశాత్తూ అత్యంత శక్తివంతమైన,దాదాపు అరవై శాతం ప్రజలు ఆధారపడ్డ,భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు  లైఫ్ లైన్ అయిన వ్యవసాయం,ఇప్పటికీ అసంఘటిత రంగంగా మిగిలిపోయింది.అందుకే వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా,నష్టాల పాలవుతున్నా,ప్రకృతి వైపరీత్యాలకు గురవుతూ నష్టపోతున్నా,ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు.

అలాంటి రంగాన్ని కేసీఆర్ ఒక గొడుకు కిందకు తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు.వాళ్ళను ఓక సంఘటిత శక్తిగా మార్చాలని రైతు సమితులను ఏర్పాటు చేస్తున్నాడు.వాళ్ళ హక్కులను కాపాడడానికి,యాచించి కాదు శాశించి తనకు కావాల్సినవి దక్కేలా రైతు ఎదగాలని,ఆలోచిస్తున్నాడు.ఒక్కసారి రైతులు సంఘటితం అయితే ప్రభుత్వాల తలరాతలు మారుస్తారు.క్రాప్ హాలిడే లు ప్రకటిస్తే,దేశంలో ఆహార భద్రతా సమస్య ఏర్పడుతుందని,భయపడి దెబ్బకు ప్రభుత్వాలు దిగివస్తాయి.ఇది రాజకీయంగా కేసీఆర్ కూ నష్టదాయకమే,కాని పదవిమీద ,అధికారం మీద వ్యామోహం లేనివాడు మాత్రమే ఇలాంటి బోల్డ్ డెసిజన్స్ తీసుకోగలుగుతాడు.ఈ నిర్ణయం ఏ పార్టీకీ మింగుడుపడదు.రైతు  బాంధవులమని చెప్పుకునే వాళ్ళు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో విజ్ఞులు అర్థం చేసుకోవాలి.

Top