You are here
Home > Latest News > ఎమ్మార్పీఎస్ విధ్వంసం నిజం కాదా?

ఎమ్మార్పీఎస్ విధ్వంసం నిజం కాదా?

Spread the love

మందకృష్ణ మాదిగ.. నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ బాధలో తప్పును ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేశామని తెలిసినా.. ఆ వాస్తవాన్ని అవాస్తవం అని చూపే ప్రయత్నంలో మాదిగల ముందే.. దోషిగా నిలబడుతున్నారు. మాదిగ రాష్ట్ర పోరాట సమితిలో చురుకైన కార్యకర్త అయిన భారతిని.. ఉద్యమం అంటూ తీరిక లేని కార్యక్రమాల్లో భాగస్వామురాలిని చేసి.. చివరికి ఆమె మరణానికి కారణం అయ్యింది మాదిగరాష్ట్ర పోరాట సమితి కాదా?

ఉద్యమం మీరు చేసి.. దానికి కారణం ప్రభుత్వం అని విమర్శిస్తారా? ఈ మాట అడిగినందుకు ఉద్యమం చేసిందే ప్రభుత్వం తీరుపై కదా అంటారేమో. కావొచ్చు. కానీ.. ఆ విషయం కేంద్రం పరిధిలో ఉన్నపుడు రాష్ట్రమైనా ఎంత వరకూ కొట్లాడుతుంది? ఇప్పటికే మీరు చంద్రబాబు, వెంకయ్యనాయుడు లాంటి నేషనల్ పాపులర్ లీడర్ల మద్దతు సంపాదించిన వాళ్లు కదా. వాళ్ల వెంట పడి.. మీరు అనుకున్నది సాధించొచ్చు కదా. ఇలా అన్నందుకు తప్పుగా భావించొద్దు.

మాదిగ రిజర్వేషన్ల సమస్యతో సంబంధం లేకుండానే సర్కారు అద్భుతమైన సంక్షేమాన్ని అమలు చేస్తోంది. అదేదీ పట్టించుకోకుండా.. సర్కార్ పై విమర్శలు చేస్తూ.. రోడ్లపై ఆందోళనలు చేస్తూ ఉన్నా కూడా పోలీసులు ఏమీ అనలేదు. చివరికి విధ్వంసానికి దిగుతుంటే.. అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలోనే వేస్తే ఎలా?

గతంలో ఉద్యమం సమయంలోనూ కేసీఆర్ తో పాటు.. చాలా మంది నేతలు అరెస్ట్ అయ్యారు. విడుదల కూడా అయ్యారు. అలాంటిదానికి మంద కృష్ణ ఇంత వివాదాస్పదం చేస్తే.. వచ్చే ఫలితం ఏదీ ఉండదన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.

 

Top