You are here
Home > Uncategorized > ఎవరు ముందస్తు అంటే భయపడుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు లక్ష్మణ్..

ఎవరు ముందస్తు అంటే భయపడుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు లక్ష్మణ్..

Spread the love

 

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏందో అందరికీ తెలుసు..

మీలాంటి చేతకాని వాళ్ల వల్ల ఏం కాదు లక్ష్మణ్..

మీది నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీనా.. జోకులు భలే పేల్చుతున్నావు లక్ష్మణ్..

ఒక్కటి చెప్పు లక్ష్మణ్. మీ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది. మీరు మాట్లాడేది ఏంది. ఏమన్నా సంబంధం ఉందా నువ్వు మాట్లాడేదానికి.. నీ చేతలకు. ఏమాత్రం సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులు మీరు. ఇలాగేనా మీరు ప్రవర్తించేది. మరీ.. ఇంత దిగజారుతనమా. దేనికోసం లక్ష్మణా. ఏం సాధిద్దామని. ఇదేనా మీ రాజకీయం.

ప్రతిదానికి సీఎం కేసీఆర్ పై బురద జల్లితే ఏమొస్తుంది నీకు. అటు కేంద్రంలోనేమో ప్రధాని మోదీ తెలంగాణ పథకాలను మెచ్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పథకాలను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేంద్రంలోనూ ప్రవేశపెట్టడానికి ఆలోచిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో మీరేమో తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏంటిది.. ఒకే పార్టీకి చెందినవారిలో ఒకరు పొగుడుతారు.. మరొకరు తిడతారు. ఏమన్నా సంబంధమున్నదా మీ మాటల్లో.

మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణ ప్రజలంటే ప్రేమ ఉంటే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిలదీసేవారు. కానీ.. మీకు తెలంగాణపై కపట ప్రేమ ఉంది. అది కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడానికే తప్పితే దేనికీ కాదు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ సీఎం కేసీఆర్ పై బురద జల్లుతున్నారు. తెలంగాణ ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నావా లక్ష్మణ్. వాళ్లేమీ చిన్నపిల్లలు కాదు. మీ పిచ్చి కూతలను నమ్మడానికి. ఈసారి బీజేపీని తెలంగాణ నుంచే తరిమేయడానికి సిద్ధంగా ఉన్నరు.

 

 

Top