You are here
Home > Latest News > ఎవరూ చేరకపోవడంతో.. రూల్స్ సవరిస్తున్న బీజేపీ

ఎవరూ చేరకపోవడంతో.. రూల్స్ సవరిస్తున్న బీజేపీ

Spread the love

ఎవరూ చేరకపోవడంతో.. రూల్స్ సవరిస్తున్న బీజేపీ

ఎంతసేపూ చేరుతున్నారు.. చేరుతున్నారు.. అంటారే తప్ప.. ఎవరూ చేరరే? ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు బీజేపీలో చేరేందుకు క్యూలో ఉన్నారు అంటారే తప్ప అలాంటివారే కనిపించరే? ఎందుకూ అంటే.. ఇంకా సమయం ఉంది అని తప్పించకుంటారే తప్ప.. అసలు సమయం ఎప్పుడో చెప్పరే? మరి ఎందుకయ్యా.. తప్పుడు కూతలు కూసేది.. నోటికొచ్చిన మాటలు మాట్లాడేది?

వస్తారు… వస్తారు.. అంటున్నారు. ఓ వైపు రేవంత్ రెడ్డి రాజకీయ వ్యభిచారులు కాంగ్రెస్ లో పొలిటికల్ పక్కలు పరుచుకుంటున్నారు. అటు చూస్తే.. టీడీపీ నుంచి మిగతా ఎవరూ.. మీ గూటికి చేరేలా కనిపించడం లేదు. టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లేంత మూర్ఖులు ఎవరూ లేరు. ఇంకా ఎవరున్నారు.. మీ పార్టీలో చేరేందుకు? రాజకీయంగా ఊరూ పేరూ కూడా లేని అరవింద్ (డీఎస్ కుమారుడు) లాంటి నాయకులేనా?

ఇదీ.. ఈ మధ్య.. బీజేపీకి ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నల వరస. ఎన్ని రోజుల నుంచి చెబుతున్నారు? ఏం రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు చేరుతున్నారు? స్పష్టంగా చెప్పండి.. అని ప్రజలు నిలదీస్తుండడంతో.. బీజేపీ నేతలు నీళ్లు నములుతున్నారు. సరైన సమాధానం చెప్పలేక.. బిక్కచచ్చి పోతున్నారు. చివరికి.. తమను తాము ఈ ప్రశ్నల పరంపర నుంచి బతికించుకునేందుకు కొత్త తరహా వింతైన సమాధానాలను.. పొంతన లేకుండా చెబుతున్నారు.

తమ పార్టీలో ఎవరైనా చేరాలంటే.. షరతులు ఉండవని కొత్త ఆఫర్ ప్రకటిస్తున్నారు. ఎవరు చేరుతున్నారో చెప్పండయ్యా అంటే.. అది కాదు విషయం.. ఇదీ అసలు విషయం అంటూ.. బీజేపీలో చేరేందుకు ఇలా ఓపెన్ ఆఫర్ ప్రకటించేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. అంటే.. ఇన్నాళ్లూ ఎవరూ రాకపోవడంతో.. ఇకపై షరతులు కూడా వర్తించకుండా.. వచ్చిన చెత్తను వచ్చినట్టుగా చేర్చుకుంటామని పబ్లిక్ గా ఆఫర్ ఇచ్చేసినట్టేగా. ఇంతలా దిగజారిపోయారంటే.. బీజేపీ రాష్ట్ర నేతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇలా చెబితే.. రేపు ఎవరైనా వచ్చి.. నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కావాలి అని షరతు పెడితే.. ఎలాగూ పార్టీ నాయకత్వం పరంగా షరతులు ఉండవు కాబట్టి.. చేరే నేతలు పెట్టే షరతును అంగీకరించి.. పదవిని త్యజిస్తారా లక్ష్మణ్? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చేతకాని మాటలు పక్కన పెట్టి.. ముందు మీ పార్టీపై ప్రజల్లో నమ్మకం కలిగించేలా నడుచుకోవాలని హితవు పలుకుతున్నారు.

Top