You are here
Home > Latest News > ఏం జెప్పిన‌వ్ వివేక్‌… ఉద్య‌మ‌కారులంటే కేసీఆర్కు  భ‌య‌మా ?

ఏం జెప్పిన‌వ్ వివేక్‌… ఉద్య‌మ‌కారులంటే కేసీఆర్కు  భ‌య‌మా ?

Spread the love

ఏం జెప్పిన‌వ్ వివేక్‌…

ఉద్య‌మ‌కారులంటే కేసీఆర్కు  భ‌య‌మా ?

గ‌డ్డం వివేక్ బీజేపీలో చేరాడో లేదో వాళ్ల భాష‌, వేషం వ‌చ్చేశాయి. అచ్చం ల‌క్ష్మ‌ణ్‌, కిష‌న్ రెడ్డి మాదిరే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నడు. బీజేపీలో చేరిన‌రోజే పెద్ద జోక్ పేల్చాడు. కేసీఆర్‌కు ఉద్య‌మ‌కారులంటే భ‌య‌మ‌ట‌!!! అందుకే వారిని పార్టీ నుంచి పంపిస్తున్న‌డ‌ట‌.. హ హ హ‌!! వివేక్ జీ.. ఇది జోక్ ఆఫ్ ది ఇయ‌ర్‌. త‌లాతోకా లేకుండా మాట్లాడ‌టంలో నువ్వు బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌ను మించిపోయావ్‌.

తెలంగాణ‌లో క‌నీసం చిన్నపిల్లోడు కూడా ఈ ఆరోప‌ణ‌ను న‌మ్మ‌డు. స్వ‌యంగా ఉద్య‌మ‌కారుడు అయిన కేసీఆర్ సాటి ఉద్య‌మ‌కారుల‌ను ఎంతో ఆదుకున్నాడు. వారికి ప‌ద‌వులు ఇచ్చి గౌర‌వించాడు. ఉద్య‌మాల్లో ప‌నిచేశార‌నే గౌర‌వంతో.. డ‌బ్బు, ప‌లుకుబ‌డి లేని వ్య‌క్తుల‌ను కూడా ఎంపీల‌ను ఎమ్మెల్యేల‌ను చేశాడు. ఉదాహ‌ర‌ణ‌కు బాల్క సుమ‌న్‌, న‌ల్లాల ఓదేలు. వీళ్లిద్ద‌రూ నీ చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం వాళ్లే! నువ్వు ఉద్య‌మ స‌మ‌యంలో పార్టీలో తిరిగావ‌ని అందలం ఎక్కించుకున్నాడు.

కాంగ్రెస్ నాయ‌కుడివే అయినా తెరాస‌లోకి చేర్చుకొని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌విచ్చాడు. గౌర‌వించాడు. కానీ నువ్వు ఏం చేశావు ?ప పాలు తాగిన రొమ్మును గుద్దావ్‌. కూర్చున్న చెట్టును న‌రుక్కున్నావ్‌. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఓట‌మికి వ్య‌తిరేకంగా ప‌నిచేశావ్‌. నీ అన్న‌ను బీఎస్పీ నుంచి నిల‌బెట్టావ్‌. ఎంపీ ఎన్నిక‌ల్లో టికెట్ రాక‌పోవ‌డంతో ఇప్పుడు తెరాస నీకు చేదు అయింది. కేసీఆర్ విల‌న్‌లా క‌నిపిస్తున్నాడు. కేసీఆర్ నువ్వు ఉద్య‌మ‌కారుడివ‌ని భ‌య‌ప‌డ‌లేదు. ఉద్య‌మ‌ద్రోహివ‌ని చీకొట్టాడు.

Top