You are here
Home > Latest News > ఏ పార్టీలో అయినా అంతర్గత గొడవలు సహజం దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే వచ్చేదేమీ ఉండదు

ఏ పార్టీలో అయినా అంతర్గత గొడవలు సహజం దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే వచ్చేదేమీ ఉండదు

Spread the love
  • వాళ్లు గోరంత చెబితే మీరు కొండంత చేసి చూపిస్తున్నారుగా?
  • అంత పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ కే సరైన నాయకుడు లేడు
  • ఏ పార్టీలో అయినా అంతర్గత గొడవలు సహజం
  • దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే వచ్చేదేమీ ఉండదు

ఏపార్టీ దీనికి అతీతం కాదు… ఏ పార్టీలో అయినా అసమ్మతులు అనేవి సహజం. అంత మాత్రాన ఆ పార్టీ నాయకులు కానీ.. నాయకత్వం కానీ తప్పు చేసినట్టు కాదు కదా. అంత పెద్ద పార్టీ.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లోనే ఎన్నో అంతర్గత కుమ్ములాటలు, గొడవలు.. చివరకు పార్టీ పగ్గాలు చేపట్టే నాయకుడే లేడు. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యత ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులే దానికి ఉదాహరణ. ఎంత సేపు నాకు ఏ పదవి వస్తుంది… నాకు ఎంత డబ్బు వస్తుంది.. నాకే ఆ పదవి రావాలి… వేరే వాళ్లకు రావద్దు.. అంటూ కొట్లాడుకుంటారు. ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. ఎందుకంటే… పార్టీలోని ప్రతి ఒక్కరికి ఏదో ఒక పదవిని చేపట్టాలని ఉంటుంది. అంతమాత్రాన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వడం కుదురుతుందా? ఏ పార్టీలోనూ అది జరగదు.

టీఆర్ఎస్ పార్టీలో కూడా అదే జరుగుతోంది. పార్టీ నాయకులందరికీ పదవులు కావాలంటే కుదరదు కదా. ఎవరికి ఏ పదవి ఎప్పుడు ఇవ్వాలో సీఎం కేసీఆర్ కు బాగా తెలుసు. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు.. పదవి రాకపోయే సరికి బాధపడి ఉండవచ్చుగాక. కానీ.. అదేమీ నేరం కాదు కదా.. పార్టీ తప్పు కాదు కదా. వాళ్లేదో గోరంత చెబితే.. దాన్ని పచ్చ మీడియా.. ఇతర మీడియా కొండంతగా చేసి చూపడం దేనికి నిదర్శనం. స్వరం పెంచిన అసమ్మతి అంటూ పిచ్చి రాతలు దేనికి. నాయినికి గత ప్రభుత్వంలో హోంమంత్రి పదవిని ఇచ్చారు సీఎం కేసీఆర్. మరి.. దాని గురించి ఎవరూ మాట్లాడరు ఎందుకు. రాజయ్య కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మరి.. వీళ్లకు పార్టీ ఎప్పుడు అన్యాయం చేసింది. ఇద్దరూ మంత్రి పదవులను అనుభవించిన వాళ్లే కదా? ఇదంతా ఎలా ఉంది అంటే పచ్చని కాపురంలో చిచ్చులు పెట్టినట్టుగా ఉంది.

తెలంగాణ కోసం పాటుపడే వాళ్లెవరికీ సీఎం కేసీఆర్ అన్యాయం చేయరు. ఆయనకు తెలుసు.. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో? ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో? కాస్త అటూ ఇటూ అవ్వొచ్చుగాక. దానికే మీడియా అసమ్మతి అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం వల్ల ఏం వస్తది. ఏం రాదు.. దాని గురించి చర్చించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. టైమ్ వేస్ట్ తప్ప.

 

 

Top