You are here
Home > Latest News > ఏ పార్టీలో సక్కగా ఇమడని నీకు అధోగతే నాగం..!!

ఏ పార్టీలో సక్కగా ఇమడని నీకు అధోగతే నాగం..!!

Spread the love

 

  • నీ రాజకీయ జీవితంలో ఏనాడూ నువ్వు తెలంగాణను పట్టించుకోలేదు..
  • పార్టీలు మారడంతోనే నీకు సరిపాయే..

పాలమూరుకు చెందిన నాగం జనార్ధన్ రెడ్డి.. గత 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. మరి.. ఎందుకు గత ప్రభుత్వాల హయాంలో పాలమూరు జిల్లాలను నువ్వు అభివృద్ధి పథంలో తీసుకెళ్లలేదు. రాష్ట్రంలో, దేశంలో ఉన్న పార్టీలన్నింటితో జత కడితివి. ఎక్కడ పదవి దక్కుతుందంటే అక్కడికి జంప్ అయితివి. నీ దగ్గరే నీతి లేదు. నువ్వు వేరే వాళ్ల గురించి మాట్లాడుతున్నవు. అసలు నువ్వు తెలంగాణ కోసం ఏం చేసినవో ముందు చెప్పు. నీ జిల్లాకైనా ఏమైనా చేస్తివా? నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచిన నువ్వు నీ నియోజకవర్గాన్ని ఎంతమేరకు అభివృద్ధి చేశావో తెలంగాణ ప్రజలకు తెలుసు.

తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్న నువ్వు ఏనాడైనా తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించావా? తెలుగుదేశం నుంచి నిన్ను చంద్రబాబు ఎందుకు బహిష్కరించాడో ముందు తెలంగాణ ప్రజలకు చెప్పు. అట్నుంచి బీజేపీలో చేరితివి. బీజేపీలోనైనా సక్కగ ఉన్నవా అంటే అదీ లేదు. మరి.. బీజేపీ నుంచి ఎందుకు బయటికి వచ్చావు.. అంతా నీ స్వంత లాభం కోసం, పదవుల కోసం లాలూచీ పడే నువ్వు తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పైన నిందలు, అభాండాలు వేస్తే పుట్టగతులుండవు.

సుదీర్ఘ రాజకీయ అనుభం ఉన్న నువ్వు.. బీజేపీలో తగిన ప్రాధాన్యం దొరకలేదని భంగపడి మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ గూటికి పోయినవు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా.. తమ స్వార్థం కోసం, పదవుల కోసం పాకులాడే వాళ్లు తెలంగాణ ద్రోహులు. అటువంటి వాళ్లను తెలంగాణ సమాజం సహించదు. ఏరి పారేస్తుంది జాగ్రత్త. గత పాలకుల హయాంలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ అటకెక్కితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తున్నది. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తున్నది. నువ్వు చేయవయితివి.. చేసే వాళ్లను చేయనీయకుండా చేస్తుంటువి.. నీకు ఎట్లా న్యాయం అయితది. వీలైతే తెలంగాణ అభివృద్ధి కోసం నీ వంతు కృషి చేయి.. లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చో కాని.. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీలాంటి చెత్తా చెదారాన్ని ఊడ్చేస్తారు. ఆ రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి.

 

 

 

Top