You are here
Home > Latest News > ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు బీజేపీకి గుర్తుకు రాలేదా అరవింద్

ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు బీజేపీకి గుర్తుకు రాలేదా అరవింద్

Spread the love
  • ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు బీజేపీకి గుర్తుకు రాలేదా అరవింద్
  • బీజేపీకి మళ్లీ పట్టం కట్టినా ఒరిగేదేమీ ఉండదు..
  • నువ్వు తెలంగాణ బీజేపీ నేతవై ఉండి.. తెలంగాణకు పసుపు బోర్డు ఎందుకు తీసుకురాలేకపోయావు..
  • టీఆర్ఎస్ ఎంపీలు, నేతలు పసుపు బోర్డు కోసం కేంద్రాన్ని నిలదీశారు..

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చావు కబురు చల్లగా చెప్పింది. తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వం అని ఖరాఖండిగా చెప్పేసింది. అది బీజేపీ అసలు క్యారెక్టర్. టీఆర్ఎస్ ఎంపీలు, నేతలు కేంద్రాన్ని పసుపు బోర్డు విషయంపై ఎన్నోసార్లు నిలదీశారు. కానీ.. పసుపు బోర్డుపై కేంద్రం మాత్రం ఉలుకు లేదు.. పలుకు లేదు. ఇదేనా కేంద్రం వ్యవహరించాల్సిన పద్ధతి.

బీజేపీకి మళ్లీ పట్టం కడితే.. పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తారట. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాటలు ఇవి. బాబూ అరవింద్.. నువ్వు ఇన్ని రోజులు బీజేపీలో ఉండి పీకిందేంటి. ఒక్క పసుపు బోర్డును తీసుకొచ్చే స్తోమత లేదు కానీ.. మళ్లీ గెలిపిస్తే.. గిట్టుబాటు ధర కల్పిస్తాం అంటారా? పసుపు బోర్డుపై ఎందుకు కేంద్రం మోకాలడ్డేస్తోంది. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే పసుపు బోర్డు కోసం కేంద్రంతో పోరాడేవాళ్లు. కానీ.. మీకు తెలంగాణపై ప్రేమా లేదు.. గీమా లేదు. అందుకే ఇలా తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు.

నిజానికి.. పసుపు బోర్డు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన అన్ని పోరాటాలు చేసింది. నిజామాబాద్ ఎంపీ కవితతో సహా.. మిగితా టీఆర్ఎస్ ఎంపీలందరూ పసుపు బోర్డు కోసం పార్లమెంట్ లో గళమెత్తారు. అయినా కేంద్రం మాత్రం స్పందించలేదు. ఇది కేంద్రం దగ్గరి సమస్య అని తెలుసుకున్న నిజామాబాద్ రైతులు.. ఇప్పుడు ప్రధాని పోటీ చేస్తన్న వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. అది అబద్ధం కాదు. నిజం. వందల రైతులు వారణాసి నుంచి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నారు. పసుపు బోర్డు విషయంలో నరేంద్ర మోదీ ఏనాడూ స్పందించలేదు. చివరకు.. పసుపు ఇవ్వడం కుదరదని మొహం మీద చెప్పేశారు.

తెలంగాణకు ఎటువంటి సాయం చేయని బీజేపీ పార్టీలో ఉండి.. బీజేపీకి మద్దతు ఇస్తూ.. తెలంగాణను అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తే నీకు పుట్టగతులు కూడా ఉండవు అరవింద్. ఆవిషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకా ఎంతకాలం ఇలా టీఆర్ఎస్ పార్టీపై అసత్యపు ప్రచారాలు చేసి బతుకుతారు. బీజేపీ పనే అయిపోయింది. ఈసారి బీజేపీ గెలిచే పరిస్థితే లేదు. నీకు డిపాజిటే రాదు. తెలంగాణ ఆకాంక్షలను పట్టించుకోని బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలి. అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీని మరోసారి పాతరేయబోతున్నారు.

Top