You are here
Home > Latest News > ఒంటరిగా పోటీ చేసే సీన్ లేకనే కదా నువ్వు పొత్తు అంటూ తిరుగుతున్నవు కోదండరామ్..

ఒంటరిగా పోటీ చేసే సీన్ లేకనే కదా నువ్వు పొత్తు అంటూ తిరుగుతున్నవు కోదండరామ్..

Spread the love

 

  • అది మహా కూటమి కాదు.. స్వాహా కూటమి.. స్వార్థ కూటమి..
  • టీడీపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ద్రోహివయ్యావు కోదండరాం..
  • అధికారం దాహం నీకు ఎంతుందో తెలంగాణ ప్రజలకు అర్థమవుతూనే ఉన్నది…

నీకు ఒంటరిగా పోటీ చేసే సీన్ లేకనే కదా కోదండరాం పొత్తులు అంటూ ఎగబడుతున్నావు. నీకు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా.. తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు కోదండరాం. నువ్వసలు పార్టీ ఎందకు పెట్టావో.. నీ ఉద్దేశమేందో తెలంగాణ ప్రజలకు తెల్వదనుకుంటున్నావా? తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు తెలంగాణ ద్రోహులంటూ తిట్టిన పార్టీలతోనే ఇప్పుడు జతకట్టి ఏం మెసేజ్ ఇస్తున్నావు తెలంగాణ జనాలకు. ఇదేనా నువ్వు చదువు చెప్పింది. నీ ప్రొఫెసర్ బుద్ధి ఇదేనా. ఛీ.. ఛీ.. అధికారం, డబ్బు వ్యామోహంలో పడి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు.

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలదే నిరంకుశ పాలన. ఇప్పుడు నువ్వు అవే పార్టీలతో జత కట్టావు. సిగ్గుందా నీకు. తెలంగాణను నాశనం చేసిన పార్టీలతో జత కట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు. ఇప్పటికే నీ పార్టీ పరువు బజారున పడింది. నువ్వు పార్టీ ఎందుకు పెట్టావో తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా నువ్వు తెలంగాణ ప్రజలను నమ్మించాలని చూసినా నమ్మేవారు ఎవరూ లేరిక్కడ. తెలంగాణ జన సమితి అంటూ పార్టీ స్థాపించి తెలంగాణ జనాలను దోచుకుతిందామని ప్లాన్ వేశావా కోదండరాం. అది ఈ జన్మలో జరగదు. అసలు నువ్వు, నీ మహా కూటమికి డిపాజిట్లు కూడా దక్కవు. నీకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయి. అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగా అభ్యర్థులను బరిలోకి దించు. అంత సీను ఉందా. రెండు మూడు చోట్ల పెట్టడానికే అభ్యర్థులు లేరు నీకు.. నీదో పార్టీ. నువ్వో మనిషివి. నువ్వు తెలంగాణకు న్యాయం చేస్తావా? తెలంగాణను అభివృద్ధి చేస్తావా? తెలంగాణ ప్రజలేమన్నా అమాయకులు అనుకుంటున్నవా ఏంది. తెలంగాణ ప్రజలు కన్నెర్ర చేస్తే నువ్వు తెలంగాణ నుంచి పారిపోవాల్సిందే మళ్ల.

Top