You are here
Home > Uncategorized > ఒకే ఒక్కడు కేసీఆర్.. కాంగ్రెస్ ను షేక్ చేసేశారు!!

ఒకే ఒక్కడు కేసీఆర్.. కాంగ్రెస్ ను షేక్ చేసేశారు!!

Spread the love
  • ప్రగతి నివేదన సభ సక్సెస్ తో కదులుతున్న కాంగ్రెస్ కూసాలు
  • భవిష్యత్తుపై బెంగతో నేతల మూకుమ్మడి విమర్శల దాడి
  • ప్రతిపక్ష నేతల ఆరాటం చూసి నవ్వుకుంటున్న జనాలు

వెనకటికి ఓ సామెత ఉంది. అది ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అదేంటంటే… ఏనుగు వెళ్తుంటే కుక్కల మంద మొరిగిందని. ఇప్పుడు కేసీఆర్ ప్రసంగానికి కాంగ్రెస్ నేతల స్పందన అచ్చంగా ఇలాగే ఉంది. చెప్పినట్టుగానే చేసిన ప్రగతిని.. ప్రగతి నివేదన సభలో కళ్లకు కట్టిన కేసీఆర్ ప్రసంగంపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు చూసినవారెవరైనా ఇదే మాట చెబుతున్నారు. వారి అరుపులను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని తేల్చేస్తున్నారు.

సభ పూర్తిగా ఫెయిలైందని.. కేసీఆర్ శకం ముగిసిందని మాజీ మంత్రి డీకే అరుణ అంటున్నారు. జనానికి ఏం సందేశం ఇచ్చారో కేసీఆర్ కే అర్థం కాకుండా ఉందని కూడా అన్నారు. లక్షల మంది జనాలు హాజరైనా.. సభకు జనాలే రాలేదని తప్పుడు కూతలు కూశారు. మరోవైపు.. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ కు నోబెల్ ఇవ్వొచ్చని అంటున్న మధుయాష్కీ… తాము గతంలో తెలంగాణ ప్రజానీకానికి చెప్పిన అబద్ధాలను విస్మరిస్తున్నారు. వందల మంది ఆత్మ బలిదానాలకు కారణం తామేనన్న కఠోర వాస్తవాన్ని కూడా మరుగున పడేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక తెలంగాణ ద్రోహి… గురు ద్రోహి, నమ్మక ద్రోహి, నయ వంచకుడు అయిన దాసోజు శ్రవణ్ కూడా ఇలాంటి వారికి వంత పాడుతూ సత్తె పూస మాటలు మాట్లాడ్డం… వింతల్లోకే పెద్ద వింత. ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయన అదుపులోనే లేకపోవడం… ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పించే విషయం. అందుకే… ఆయన చేసిన కామెంట్లను కూడా జనాలు లైట్ తీసుకుంటున్నారు.

ఓవరాల్ గా… నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్న సామెత నిజమే అన్నట్టుగా ప్రవర్తిస్తూ.. అసంబద్ధ విమర్శలకు దిగుతూ.. పసలేని ఆరోపణలు చేస్తూ… కాంగ్రెస్ మూకలు టీఆర్ఎస్ ప్రజాభిమానాన్ని తగ్గించాలని ఆరాటపడుతున్నాయి. కానీ.. ఇలాంటి ప్రతి అడుగుకూ టీఆర్ఎస్ కు అభిమానం రెండింతలు పెరుగుతుందని.. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ శ్రేణులు విస్మరిస్తున్నాయి. అందుకే… ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? అని జనం కూడా నిట్టూరుస్తున్నారు. కేసీఆర్ కే జై కొడుతున్నారు. కాంగ్రెస్ ను నమ్మేది లేదని తెగేసి చెబుతున్నారు.

Top