You are here
Home > Latest News > ఒక్కరోజుతో ముగిసిపోయేది కాదు.. భూపంపిణీ పథకం నిరంతర ప్రక్రియ.

ఒక్కరోజుతో ముగిసిపోయేది కాదు.. భూపంపిణీ పథకం నిరంతర ప్రక్రియ.

Spread the love
  • ఎవరన్నా అడిగారా.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భూపంపిణీ చేయాలని..
  • పేద దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకం అది..
  • దేశంలోనే టీఆర్ఎస్ సర్కారును ఆదర్శంగా నిలిపిన బృహత్తర పథకం..
  • వేల ఎకరాలు దళితులకు పంపిణీ చేసింది నిజం కాదా?

తెలుగులో ఓ సామెత ఉంది. అన్నీ తెలిసిన వాళ్లకైనా చెప్పొచ్చు.. లేదంటే ఏమీ తెలియని వాళ్లకైనా చెప్పొచ్చు. ఆ రెండు జాతుల వాళ్లు అయితే ఏదైనా చెబితే వింటరు.. కాస్త ఆలోచిస్తరు. కాని.. ఈ మిడిమిడి జ్ఞానంతో కొట్టుమిట్టాడేలాంటోళ్లకు ఏం జెప్పినా వేస్టే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే.. తెలంగాణలో కొన్ని దుష్టశక్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలికి మరీ వాసన చూస్తున్నాయి. వాళ్లు చేయరు.. చేసేవాళ్లను చేయనీయరు అన్న తరహాలో ఉన్నారు. మరి ఇసంటోళ్లను ఏం చేయాల్నో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తరు. త్వరలోనే వాళ్లకు సరైన బుద్ధి చెప్తరు.

దళితుల మూడెకరాల భూపంపిణీపై కాకిలెక్కలు చెబుతూ ఏం సాధిద్దామని. భూరికార్డుల ప్రక్షాళన చేయించింది ఎందుకు. అసలు తెలంగాణల భూమి ఎంతున్నది? ఎవరి దగ్గర ఎంతున్నది? ప్రభుత్వ భూమి ఎంత? పనికి వచ్చే భూమి ఎంత? రాళ్లు రప్పలు ఉన్న భూమి ఎంత ఉన్నది? అసలు ఏంది కథ? ఇవన్నీ తెల్వాల్నా వద్దా? మరి.. గత ప్రభుత్వాలు ఏమైనా ఇటువంటి భూరికార్డుల కార్యక్రమం ఏమన్నా చేపట్టిందా? చొరవ తీసుకున్నాయా? లేదు.

బట్ట కాల్చి మీదేయడం మాత్రం తెలుసు. తెలంగాణ ప్రజలకు తెలియదా? ఎవరు ఏం చేస్తున్నారో? వాళ్లేమైనా అమాయకులా.. ఎవరు ఏది చెబితే అది నమ్మడానికి. కాకమ్మ కథలు చెప్పంగనే సరిపోయిందా? భూపంపిణీ పథకం అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కరోజు, రెండ్రోజులతో అయిపోయేది కాదు. ఇప్పటికే వేల ఎకరాలు దళితులకు పంపిణీ చేసింది నిజం కాదా? భూరికార్డుల ప్రక్షాళన జరిగి ఎన్ని రోజులైతున్నది. అది పూర్తి కాగానే రైతులకు రైతు బంధు, ఆ తర్వాత రైతు బీమా.. పాసు బుక్కుల పంపిణీ ఒకదాని తర్వాత మరోటి చేస్తూనే వెళ్తున్నది ప్రభుత్వం. ఇవన్నీ ఇంకా పూర్తే కాలేదు. కాకమ్మ లెక్కలు చూపిస్తూ దళితులకు భూపంపిణీ చేయలేదనే ప్రతిపక్షాల మాయమాటలు ఎలా నమ్మాలి. మీ హయాంలో ఎంతమంది దళితులకు భూమిని పంపిణీ చేశారో కాస్త చెప్తారా? కనీసం.. ఒక్కరంటే ఒక్క దళితుడికి భూపంపిణీ చేశామని చెప్పండి. చెప్పలేరు. ఎందుకంటే.. ఎంతసేపు మీ పొట్ట నింపుకోవడానికి ప్రయత్నించారే తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల గోడును ఏనాడైనా పట్టించుకుంటేగా మీ ప్రభుత్వాలు. ఇకనైనా మారండి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రంలో మీరూ భాగస్వాములు అవ్వండి. లేదంటే మీ గతి అంతే.

Top