You are here
Home > Latest News > ఒక జర్నలిస్ట్ గా ప్రభుత్వ పథకాలను ఓట్ల పథకాలుగా అని హేళన చేస్తూ రాయడం నీకే చెల్లింది మంచాలా …!!!

ఒక జర్నలిస్ట్ గా ప్రభుత్వ పథకాలను ఓట్ల పథకాలుగా అని హేళన చేస్తూ రాయడం నీకే చెల్లింది మంచాలా …!!!

Spread the love

 

  • తెలంగాణ రైతన్న బాగుపడటం ఈ దుష్టశక్తులకు ఇష్టం లేదు..
  • అందుకే రైతన్నను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నురు..
  • మనకు కూడు పెట్టే రైతన్నను ఆదుకుంటే తప్పా?
  • గత ప్రభుత్వాలు రైతన్న నట్టేట ముంచినా.. తెలంగాణ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది..
  • తెలంగాణ రైతన్న కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మొదటిసారి..

సీఎం  కేసీఆర్ కూడా రైతు బిడ్డే. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తే. రైతుకు ఏం కావాలి.. ఏం చేస్తే బాగుపడుతాడు. సరైన సంక్షేమ పథకాలు ఏవైతే బాగుంటాయి అని దూరదృష్టితో ఆలోచించి ఇప్పటి వరకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవ్వరూ ప్రవేశపెట్టని పథకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఇతర రాష్ట్రాలు ప్రస్తుతం తెలంగాణ పథకాలను తమ రాష్ట్రాల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పథకాలను ఎన్నోసార్లు పొగిడింది. ఇదివరకు అభివృద్ధి అంటే గుజరాత్ అని మనం మాట్లాడుకునేవాళ్లం. కాని.. ఇప్పుడు అభివృద్ధి అంటే అంతా తెలంగాణ వైపు చూస్తున్నారు.

ఇదంతా ఎలా సాధ్యమయింది. గత ప్రభుత్వాలు రైతన్నను నట్టేట ముంచినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ముందుగా రైతన్నకు ఉచితంగా 24 గంటల కరెంట్ ను అందించింది. 24 గంటల కరెంట్ సాగు కోసం ఇవ్వడం అనేదే ఓ సంచలనం. అందులో ఉచితంగా ఇవ్వడం అనేది మరో సంచలనం. ఇన్ని సంచలనాలను సృష్టిస్తూ.. సీఎం కేసీఆర్ రైతుల కోసం పెట్టుబడి సాయం, బీమా, పట్టాదారు పాసుపుస్తకం, నాణ్యమైన విత్తనాలు.. ఇలా తెలంగాణ రైతన్నకు ఎన్నో పథకాలు ప్రారంభించారు. అవి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. తెలంగాణ రైతన్న ఇప్పుడు ఎంతో ఖుషీగా ఉన్నడు.

దీంతో తెలంగాణ రైతన్నకు మరింత ఊతం ఇచ్చే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా యూరియా ఇవ్వాలని ఆలోచిస్తున్నది. దీంతో తప్పేముంది. దీన్ని కూడా రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నాయి కొన్ని దుష్టశక్తులు. తెలంగాణ రైతన్నకు మేలు జరుగుతుంటే ఓర్వలేని వాళ్లు..సోషల్ మీడియాలో, అక్కడా ఇక్కడా ఉచిత యూరియాను రాజకీయం చేస్తూ.. ఓట్ల కోసం చేసే స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు.

తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాను ప్రవేశపెట్టారు. వాటితో పాటే ఈ ఉచిత యూరియా కూడా తప్పితే.. ఓట్ల కోసం చేసే పని అయితే కాదు. ఓట్ల కోసమే చేయాలనుకుంటే.. ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు ప్రవేశపెట్టిన పథకాలు చాలు. ఇంకా అవసరమే లేదు. మరి.. ఈ దుష్టశక్తులు ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీదేస్తున్నయో అర్థం కావట్లేదు. గత ప్రభుత్వాలు కనీసం ఇప్పటి పథకాల్లో ఒక్కటైనా ప్రవేశపెట్టాయా లేదు. మరి.. అప్పుడు ఆ ప్రభుత్వాలను ఈ దుష్టశక్తులు ఎందుకు నిలదీయలేదు. ఇదేం పద్ధతి. తెలంగాణ వాళ్లై ఉండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ.. తెలంగాణ ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం. ఏరూపంలో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నవాళ్లెవరైనా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు జాగ్రత్త.

 

 

 

 

 

 

 

Top