You are here
Home > Latest News > ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అత్యుత్సాహం

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అత్యుత్సాహం

Spread the love
  • – సంపత్, కోమటిరెడ్డి సభ్యత్వ పునరుద్ధరణపై రేవంత్ అతి చొరవ
  • – అసెంబ్లీ స్పీకర్ తో రేవంత్ రెడ్డి దురుసు ప్రవర్తన
  • – కాంగ్రెస్ లో ఒంటరైన రేవంత్ తీరుపై పేలుతున్న జోకులు

వెనకటికి రేవంత్ రెడ్డి అని ఓ పనికిమాలిన వెధక ఒకడున్నాడులే… అంటూ… మనం తాతలమయ్యాక మన మనవలు, మనవరాళ్లకు చెప్పుకోవాల్సి వచ్చే దుస్థితి దాపురించేలా ఉంది. ఎందుకంటే.. ఇన్నాళ్లూ కాంగ్రెస్ లో దిక్కూ మొక్కూ లేకుండా సోషల్ మీడియా నుంచి రాజకీయ వ్యభిచారం కొనసాగిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సడన్ గా కోమటిరెడ్డి, సంపత్ తరఫున వకాల్తా పుచ్చుకున్నాడట.

ఆ ఇద్దరు చేసిన తప్పును ఒప్పు అని తప్పుడు కూతలు కూయడమే కాదు. వారి సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ స్పీకర్ మధుసూదనాచారిని కలిసిన కాంగ్రెస్ బృందంలో రేవంతుడు కూడా ఉన్నాడట. ఆ సమయంలో.. పెద్దాయన అయిన స్పీకర్ మీద.. రేవంత్ కాస్త అతిగా మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. నోరు అదుపులో పెట్టుకోకుండా.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. అంతా చూస్తుంటే.. వాళ్లిద్దరినే కాదు.. నన్నెందుకు సస్పెండ్ చేయరో చెప్పండి అన్నట్టుగా రేవంత్ వైఖరి ఉందన్న మాట కూడా వినిపిస్తోంది.

దీంతో.. ఆఫ్ ద రికార్డ్ గా రేవంత్ మీద జోకుల మీద జోకులు పేలుతున్నాయి. రాజకీయ వ్యభిచారం అలవాటైన రేవంత్ రెడ్డి.. అదే రాజకీయ మైలేజ్ కోసం.. స్పీకర్ ను తిట్టి.. జోకర్ వేశాలు కూడా వేస్తున్నాడంటూ కామెంట్లు జోరందుకున్నాయి. ఇంత జరిగినా కూడా.. రేవంత్ మాత్రం తన తీరు మార్చుకునే అవకాశమే లేదని.. ఆయన ప్రత్యర్థులు కామెంట్ చేస్తున్నారు.

ఎందుకంటే.. రాజకీయ వ్యభిచారపు రుచి మరిగిన పొలిటికల్ భౌభౌ మన రేవంత్ రెడ్డి. అలాంటోడు మారతాడా? నెవ్వర్. మారనే మారడు. అందుకే ఇలాంటి కంపు చేష్టలన్నీ చేస్తుంటాడు. మనమే లైట్ తీసుకోవాలి. అంతే.

Top