You are here
Home > Latest News > కన్ఫమ్.. దొంగల కలయిక ఖరారయ్యింది!

కన్ఫమ్.. దొంగల కలయిక ఖరారయ్యింది!

Spread the love

ఇన్నాళ్లూ మేం చెబితే.. కొందరు పట్టించుకోలేదు. ఆరోపణలుగానే కొట్టిపారేశారు. కానీ.. ఇప్పుడు సాక్షాత్తూ కాంగ్రెస్ నేతలే.. శాసనమండలిలో కాంగ్రెస్ కు నాయకుడిగా ఉన్న.. జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న షబ్బీర్ అలీ లాంటి నాయకులే.. ఓపెన్ అయిపోతున్నారు. పార్టీలోకి కొత్త రక్తం వస్తుందంటే.. స్వాగతిస్తామని.. జేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు.. టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి వస్తే స్వాగతిస్తామని బహిరంగంగా షబ్బీర్ అలీ చెప్పేశారు.

ఇన్నాళ్లూ ప్రభుత్వంపై కుట్రలు చేస్తూ.. కాలం గడిపేసిన ఈ దుర్మార్గుల బ్యాచ్.. ఇప్పుడు కలిసి ఒకే వేదికపై రాజకీయ వ్యభిచారం చేసేందుకు సిద్ధమవుతోంది. దగుల్బాజీ లంటే ఇంకా అర్థం తెలియని వాళ్లకు.. ఇదిగో మేమే అని నిరూపించేలా రాజకీయం చేసేందుకు రెడీ అవుతోంది. ప్రజలు ఛీ కొడుతున్నా పట్టించుకోకుండా.. ఉమ్మేస్తున్నా పట్టింపు లేకుండా.. కలిసి కుట్రలు చేసేందుకు.. అనుకూలంగా ఉండే శక్తులన్నీ ఒక్కటవుతున్నాయి.

నిజాయితీకి మారుపేరుగా తనకు తాను భావించే కోదండరాం.. ఇప్పుడు రేవంత్ రెడ్డితో కలిస్తే.. ఆ రాజకీయం తీరు ఎలా ఉంటుందో మనం సులువుగా ఊహించుకోవచ్చు. దొంగా దొంగా వచ్చాడే.. అన్నట్టు.. ఇద్దరూ కలిసి.. అసలైన దోపిడీ రాజకీయాలను తెలంగాణ తెరపై తీసుకువచ్చే ప్రయత్నాలను మనం ముందుగానే అంచనా వేయవచ్చు. ఇన్నాళ్లూ.. తెలంగాణను ఉమ్మడి ఆంధ్రాలో దోపిడి చేసి చేసి.. చివరకి 2014 ఎన్నికల్లో చతికిలబడిపోయిన కాంగ్రెస్ .. ఇప్పుడు సొంత బలాన్ని కాకుండా.. బయటి వ్యక్తుల.. దుర్మార్గపు శక్తుల బలం పైనే ఆధారపడుతుందని అర్థం చేసుకోవచ్చు.

అందుకే.. ప్రజలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని పన్నాగాలు పన్నినా.. రేవంత్ రెడ్డి లాంటి పక్కా రాజకీయ వ్యభిచారిని, కోదండరాం లాంటి మోసకారిని కాంగ్రెస్ తన గుప్పిట్లో పెట్టుకున్నా.. తెలంగాణను కాపాడుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ రాకుంటే.. తెలంగాణ అన్యాయమైపోతుందన్న భావనలో ఉన్న ప్రజలు.. మళ్లీ టీఆర్ఎస్ కే ఓట్లు వేసి.. 2019లో మరింత భారీ మెజారిటీ అందించేందుకు నిర్ణయించుకుంటున్నారు.

Top