You are here
Home > Latest News > కమ్యునిస్టులు కలల్లో బతుకుతున్నారు ….

కమ్యునిస్టులు కలల్లో బతుకుతున్నారు ….

Spread the love

సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులకు పగటి కలలకు హద్దే లేకుండా పోతోంది. తమ వల్లే ప్రభుత్వం నడుస్తోందన్నంతగా వారి మాటలు.. రోజుకోరకంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. టీమాస్ ఫోరం ఏర్పాటు తర్వాత.. మహాజన పాదయాత్ర సందర్భంగానే పాలకుల్లో కదలిక వచ్చిందంటున్న తమ్మినేని మాటలు.. జనానికి చికాకు తెప్పిస్తున్నాయి. అణగారిన వర్గాలనే మాట.. ఆ యాత్రతోనే వచ్చిందంటున్న తమ్మినేని మాటల్లో అర్థమే లేదన్న అభిప్రయాలు వినిపిస్తున్నాయి.

మరి పాదయాత్రకు ముందు.. అణగారిన వర్గాలకు చేసిన.. ఇప్పుడు కూడా చేస్తున్న ప్రగతి గురించి తమ్మినేని ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక… మూడెకరాల భూ పంపిణీ నుంచి మొదలు పెడితే.. అణగారిన పిల్లల కోసమే.. అంబేద్కర్ జయంతి సాక్షిగా గురుకులాల ఏర్పాటును ప్రకటించి.. వాటిల్లో తరగతులు మొదలు పెట్టి.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అమలు చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్.

బడుగుల పిల్లలు ఉండే.. హాస్టళ్లలో సన్నబియ్యం అందించి.. పేదింటి బిడ్డకూ.. ముఖ్యమంత్రి మనమడు తినేంతటి నాణ్యమైన అన్నాన్ని అందించారు.. సీఎం కేసీఆర్. అణగారిన వర్గాల చదువులకు ఇబ్బంది కలగొద్దనే.. విదేశాల్లో చదువుకునేందుకు లక్షల రూపాయల ఉపకారవేతనాలు అందించారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కష్టంగా ఉండొద్దనే.. ఓ అన్నగా.. షాదీముబారఖ్, కల్యాణ లక్ష్మిని అమలు చేశారు.

బీడీలు చేసుకునే పేద మహిళలకు.. తోడు లేని ఒంటరి మహిళలకు.. ఎక్కడా ఇబ్బంది రావొద్దని.. పెన్షన్లు ఇప్పిస్తూ సామాజిక భద్రత కల్పించారు. మరి.. ఇవన్నీ.. సీపీఎం నేతల కారణంగానే జరుగుతున్నాయా? వీటన్నిటికీ తమ్మినేని సమాధానం చెప్పగలడా? లేక.. ఎప్పటిలాగే మొహం చాటేసుకుని తిరుగుతాడా? ఏ మాత్రం సిగ్గూ శరం ఉన్నా.. తమ్మినేని.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

అణగారిన వర్గాల కోసం నిజమైన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రిని ఆడిపోసుకున్నందుకు.. తమ్మినేని పశ్చాత్తాప పడాలి. ఎన్ని రాజకీయ పార్టీలను కూడదీసి.. ఫ్రంట్ ఏర్పాటు చేసినా.. ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న టీఆర్ఎస్ ముందు.. అంతా దిగదుడుపే అన్న వాస్తవాన్ని గుర్తించాలి.

Top